Latest Posts

వడ్డేపాళ్యంలో ‘ఇంటింటికీ టీడీపీ’.. మాలయనూరులో విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ చేసిన ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు!

అనంతపురం జిల్లా-కళ్యాణదుర్గం

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో భాగంగా నాలుగవ రోజు కుందుర్పి మండలం వడ్డేపాల్యం గ్రామంలో టీడీపీ సీనియర్ నాయకులు, మండల గ్రామ స్థాయి నాయకులతో కలసి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు పాల్గొని ప్రతి ఇంటికి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమం, అభివృద్ధి వివరిస్తూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు

గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యే గ్రామస్థులు, నాయకులు పూలవర్షం కురిపించి ఘన స్వాగతం పలుకగా ఆంజనేయ స్వామి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు.

అనంతరం గ్రామంలోని మహర్షి వాల్మీకి విగ్రహానికి పూలమాల వేశారు..ఈ సందర్బంగా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్య పాలన, కనీసం గ్రామాల్లో సరైన మౌళిక వసతుల కల్పనపై కూడా ద్రుష్టి పెట్టకుండా సమస్యలను పెంచి వెళ్లారని ఇప్పుడు వాటిని అదిగమించి గ్రామీణ రహదారులతో పాటు గ్రామాల్లో మౌళిక వసతులైన విద్యుత్, తాగునీరు, సీసీ రహదారులు నిర్మించి ప్రజల సమస్యలు లేకుండా చూస్తామని తెలిపారు.

నేడు మూడవ రోజు గ్రామీణ విద్యార్థులకు ప్రోత్సాహక కానుకగా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు అందిస్తున్న సైకిళ్ల పంపిణీ కుందుర్పి మండలం మాలయనూరు గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించగా
టీడీపీ మండల, స్థానిక నాయకులు ఎమ్ ఈ ఓలు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందంతో కలసి పాల్గొని సైకిళ్లు విద్యార్థులకు వారి తల్లిదండ్రుల సమక్షంలో అందజేశారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో అందరికి అమ్మవడి అని చెప్పి తీరా అందించే సమయానికి ఒక్క ఇంట్లో ఒక్కరికే ఇచ్చి వారి చదువులను తుంగలో తొక్కాడన్నారు.అంతే కాకుండా కేవలం అమ్మవడి పథకం ద్వారా కేవలం 5500 కోట్లు అందించారని,కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు తల్లిదండ్రుల బాధలు తెలుసుకుని అధికారంలోకి వచ్చిన వెంటనే ఇంట్లో ఒకటో తరగతి నుంచి ఇంటర్ చదివే విద్యార్థులు ఎంతమంది ఉంటే అందరికి తల్లికివందనం అందిస్తామని హామీ ఇచ్చి నేడు 10,190 కోట్లు కేటాయించి ప్రతి తల్లి ఖాతాకు జమ చేసి నిబద్దత చాటుకున్నారని అందులో కూడా చాలీ చాలని జీతాలతో ఇబ్బందులు పడుతున్న 30,000 మంది అంగన్వాడీ ఉపాధ్యాయులకు అందించి కూటమి ప్రభుత్వం గొప్ప మనసు చాటుకుందని తెలిపారు..

Posted Under AP
Editor