కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయంలో వరుణ హోమం.. 108 కలశాలతో స్వామివారికి మహాభిషేకం

శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి వారి దేవస్థానం – కసాపురం.

దేవస్థానం నందు రాష్ట్రంలో నెలకొన్న వర్షాలు లేక అనావృష్టి నివారణకు గాను అన్ని దేవస్థానము లందు 3రోజులు దీక్షతో వారుణసూక్త విరాట పర్వ సుందర కాండ పారాయణములు వరుణ రుష్య శృంగ మహర్షి మంత్ర జపం నిర్వహించి, ఈరోజు న శ్రీ ఆంజనేయ స్వామి వారి ఉత్సవమూర్తికి 108 కలషములతో అభిషేకం వరుణ మంత్ర హోమం పూర్ణాహుతి తో కార్యక్రమం నిర్వహించబడింది.

ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ శ్రీ మేడేపల్లి విజయ రాజు గారు, అనువంశిక ధర్మకర్తలు శ్రీమతి కె.సుగుణమ్మ గారు, శ్రీ కె. అనంతచార్యులు , ప్రధాన అర్చకులు శ్రీ కె రాఘవాచార్యులు గారు , వేద పండితులు, అర్చకులు, గ్రామ ప్రజలు భక్తులు పాల్గొన్నారు.

Posted Under AP
Editor