ఎస్‌ఐఆర్ మ్యాపింగ్‌ను వేగవంతంగా 100% పూర్తి చేయాలి..

–ఎస్‌ఐఆర్ మ్యాపింగ్‌ను వేగవంతంగా 100% పూర్తి చేయాలి
–తప్పులు లేకుండా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా విధులు నిర్వహించాలి
–నిర్లక్ష్యం చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవు..తహసీల్దార్ శోభ సువర్ణమ్మ హెచ్చరిక..
ఆలూరు న్యూస్..
కర్నూలు జిల్లా ఆలూరు మండలం మొలగవల్లి గ్రామంలో గురువారం తహసీల్దార్ శోభా సువర్ణమ్మ మరియు మొలగవల్లి కొట్టాలకు, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ బసవనగౌడ్ పర్యటించి ఎస్‌ఐఆర్ (SIR) మ్యాపింగ్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా బీఎల్‌వోలకు పలు కీలక సూచనలు చేశారు. ఎస్‌ఐఆర్(SIR)మ్యాపింగ్ పనులను వేగంగా పూర్తి చేయాలని, ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని ఆమె ఆదేశించారు. ప్రతి ఇంటికి వెళ్లి వివరాలను క్షుణ్ణంగా నమోదు చేయాలని అన్ని పొలిటికల్ పార్టీల బిఎల్ఏ (BLA)లను మీరు మీ వెంట పిలుచుకొని వెళ్లగలరు వారి సహాయ సహకారాలు కూడా తీసుకోవలసినదిగా ఆదేశాలు జారీ చేసి ప్రజలకు అవసరమైన సహాయం అందించాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే సంబంధిత బీఎల్‌వోలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ శోభా సువర్ణమ్మ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఎల్‌వోలు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Posted Under AP
Editor