తప్పిపోయిన ఇద్దరు బాలికలను పట్టుకున్న పోలీసులు…

తప్పిపోయిన ఇద్దరు బాలికలను పట్టుకున్న పోలీసులు

అనంతపురం జిల్లా ఎస్పీ జగదీశ్ గారి ప్రత్యేక శ్రద్ధ పర్యవేక్షణతో తప్పిపోయిన ఇద్దరు బాలికలను పోలీసులు రాత్రికి రాత్రే గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు.

స్పెషల్ బ్రాంచ్ సీఐ క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా సుమారు 20 ప్రత్యేక బృందాలు వారి పరిధిలోని బస్ డిపోలు, బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, దేవాలయాలు, సత్రాలు, బస్ స్టాప్‌లలో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు.
కర్ణాటక సరిహద్దు జిల్లా బళ్లారిలో కూడా తనిఖీలు నిర్వహించి, అక్కడి పోలీసులను అప్రమత్తం చేశారు. పుట్టపర్తి జిల్లా పోలీసులు సైతం రాత్రంతా బాలికల కోసం తనిఖీలు చేశారు.
రైల్వే, బళ్లారి, గుంతకల్లు RPF, GRP పోలీసులతో ఎస్పీ స్వయంగా మాట్లాడి, బాలికల వివరాలు అందించి ప్రత్యేక బృందాలతో తనిఖీలు చేపట్టారు.
కళ్యాణదుర్గం డివిజన్ డిఎస్పి రవిబాబు హుటాహుటిన టి.వీరాపురం గ్రామానికి చేరుకొని, తప్పిపోయిన బాలికల కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి భరోసా కల్పించారు.
రాయదుర్గం రూరల్ సీఐ వెంకట రమణ గారు సిబ్బందితో కలిసి విస్తృత తనిఖీలు నిర్వహించారు. సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం కారణంగా, రాయదుర్గం పట్టణంలోని మేధర వీధిలో తిరుగుతున్న బాలికలను గుర్తించిన అగ్రహారం కిరణ్ అనే వ్యక్తి వారికి రాత్రి ఆశ్రయం నిచ్చాడు. ఉదయం ఆయన సీఐ వెంకట రమణ గారికి సమాచారం ఇవ్వడంతో, పోలీసులు బాలికలను క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు.

బైట్స్.రవిబాబు, కళ్యాణదుర్గం డివిజన్ డిఎస్పి

Posted Under AP
Editor