ఏటీఎంల వద్ద భద్రతా చర్యలు తప్పనిసరి – బ్యాంకు సిబ్బందికి సీఐ సూచన

ఏటీఎంల వద్ద భద్రతా చర్యలు తప్పనిసరి – బ్యాంకు సిబ్బందికి సీఐ సూచన

ముదిగుబ్బ మండల కేంద్రంలోనిప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల ఏటీఎంల వద్ద ముఖ్యంగా రాత్రి వేళల్లో భద్రతా చర్యలు తప్పనిసరిగా చేపట్టాలని ముదిగుబ్బ అప్‌గ్రేడ్ సీఐ శివరాముడు సూచించారు. ఈ మేరకు సోమవారం పోలీస్ స్టేషన్‌లో ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల సిబ్బందితో సమావేశం నిర్వహించారు.
సమావేశంలో సీఐ శివ రాముడు, ఎస్సై కేతన్న మాట్లాడుతూ, ఏటీఎంల వద్ద రాత్రి సమయంలో భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేయడంతో పాటు సీసీ కెమెరాలు, అలారం వ్యవస్థలు సక్రమంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా సంఘటనలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని బ్యాంకు సిబ్బందికి తెలిపారు. బ్యాంకులు, ఏటీఎంల భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని సీఐ శివరాముడు పేర్కొన్నారు

Posted Under AP
Editor