తాడిమర్రి( yes9tv )ఖరీఫ్ సీజన్‌కు సన్నద్ధం కావాలి – వ్యవసాయ శాఖ అధికారులకు ఆదేశాలు
తాడిమర్రిలో వ్యవసాయ శాఖ సమీక్ష సమావేశం
తాడిమర్రి, జూన్ 29: ఖరీఫ్ సీజన్ నేపథ్యంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వ్యవసాయ శాఖ సేవలను సమర్థవంతంగా అందించాలని మండల రెవెన్యూ అధికారి, మండల వ్యవసాయ అధికారి సూచించారు. తాడిమర్రి మండలంలోని 10 రైతు సేవా కేంద్రాల అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు.
ఈ సందర్భంగా ఖరీఫ్ సీజన్‌కు అవసరమైన విత్తనాల పంపిణీ, వివిధ ప్రభుత్వ పథకాల అమలు, ఏపీ ఏఐఎంఎస్ నమోదు, కిసాన్ క్రెడిట్ కార్డుల రెన్యువల్స్, మట్టి నమూనాల సేకరణ, పీఎండీఎస్ ప్రీ-మాన్సూన్ డ్రై సోయింగ్ కార్యక్రమాలు, మండలంలో ఎరువుల లభ్యత, పాడిపంటల సాగు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు.
రైతులకు అవసరమైన సాంకేతిక సలహాలు, సూచనలు సకాలంలో అందించేందుకు రైతు సేవా కేంద్రాల సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని అధికారులకు సూచించారు. రైతులు సలహాల కోసం వచ్చినప్పుడు మిత్రభావంతో వ్యవహరించి, వారికి కావలసిన సమాచారాన్ని త్వరితగతిన అందించి ప్రభుత్వ సేవలను చేరువ చేయాలని పేర్కొన్నారు.
మండలంలోని వివిధ రెవెన్యూ గ్రామాల్లో పెండింగ్‌లో ఉన్న జాయింట్ ఎల్పీఎంఎస్ పనులను సంబంధిత వీఆర్వోలు, సర్వేయర్లు, రైతు సేవా కేంద్రాల సిబ్బంది కలిసి వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే ప్రతి వారం నమోదవుతున్న విత్తన విస్తీర్ణాల వివరాలను మండల గణాంక అధికారికి, వ్యవసాయ శాఖకు సకాలంలో అందజేసి ప్రభుత్వానికి నివేదికలు పంపాలని సూచించారు.
ఈ సమావేశంలో మండల రెవెన్యూ అధికారి, మండల వ్యవసాయ అధికారి, వ్యవసాయ విస్తరణ అధికారి, మండల గణాంక అధికారి, 10 రైతు సేవా కేంద్రాల అధికారులు పాల్గొన్నారు.
ఖరీఫ్ సీజన్‌కు సన్నద్ధం కావాలి..
