వంగవీటి రాధా–రంగా మిత్రమండలి జిల్లా ఉపాధ్యక్షుడిగా గొర్ల విజయ్ నియామకం
ధర్మవరం, జూన్ 26: వంగవీటి రాధా–రంగా మిత్రమండలి జాతీయ అధ్యక్షురాలు వంగవీటి ఆశ కిరణ్ ఆదేశాల మేరకు, ఉమ్మడి అనంతపురం–శ్రీ సత్యసాయి జిల్లాలకు చెందిన ధర్మవరం పట్టణ వాసి గొర్ల విజయ్ను ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమించారు.
ఈ నియామక కార్యక్రమం రాయలసీమ జోనల్ కన్వీనర్ బాలం సుబ్బరాయుడు, రాయలసీమ జోనల్ సెక్రటరీ నక్కా సునీల్ చంద్ర, వైఎస్సార్ కడప జిల్లా అధ్యక్షుడు దొంతు మురళీమోహన్, బీసీ విభాగం అధ్యక్షుడు పల్లపు రమణ ఆధ్వర్యంలో జరిగింది. సభ్యుల సమక్షంలో గొర్ల విజయ్‌కు నియామక పత్రాన్ని అందజేసి బాధ్యతలు అప్పగించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ యువతలో సేవాభావాన్ని పెంపొందిస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని సూచించారు. అలాగే వంగవీటి రాధా–రంగా మిత్రమండలి సిద్ధాంతాలు, నిర్ణయాలకు కట్టుబడి ఉండి ఉమ్మడి జిల్లాలో సంస్థను మరింత బలోపేతం చేయాలని కోరారు.
నూతనంగా బాధ్యతలు స్వీకరించిన గొర్ల విజయ్ మాట్లాడుతూ, తనపై విశ్వాసం ఉంచి ఈ కీలక పదవిని అప్పగించిన జాతీయ అధ్యక్షురాలు వంగవీటి ఆశ కిరణ్‌తో పాటు రాయలసీమ జోనల్ నాయకత్వానికి, జిల్లా నాయకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. సంస్థ అభివృద్ధి కోసం అంకితభావంతో పనిచేస్తానని పేర్కొన్నారు.
అనంతరం నాయకులను శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలకుంట శివ, సాకే శివ, సాత్విక్, సాకే నరసింహులు తదితరులు పాల్గొన్నారు
వంగవీటి రాధా–రంగా మిత్రమండలి జిల్లా ఉపాధ్యక్షుడిగా గొర్ల విజయ్ నియామకం
