ప్రభుత్వ ఆస్తి ధ్వంసం, పోలీస్ సిబ్బందిపై దాడి, బెదిరింపుల కేసులో అరెస్ట్…
ముదిగుబ్బ Yes 9TV
శ్రీ సత్యసాయి జిల్లా, ముదిగుబ్బ (U/G) పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన Cr.No.66/2026 U/Sec.121(1) r/w 3(5) BNS కేసులో ప్రధాన నిందితుడైన నంద్యాల చంద్ర మోహన్, వయస్సు 45 సంవత్సరాలు, తండ్రి లేట్ రాముడు, బ్రహ్మదేవరమర్రి గ్రామం, ముదిగుబ్బ మండలం, ను 24.06.2026 తేదీన అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసు వివరాల ప్రకారం, నిందితుడు చంద్ర మోహన్ తన గ్రామంలోని పంచాయతీ తాగునీటి బోరును రాళ్లతో ధ్వంసం చేసి, దానికి సంబంధించిన వైర్లను పీకివేసినట్లు విచారణలో వెల్లడైంది. ఈ విషయంపై గ్రామస్థులు ప్రశ్నించగా వారిని దుర్భాషలాడి, మరోసారి అడ్డుకుంటే చంపేస్తానని బెదిరించినట్లు తెలిసింది.
అదేవిధంగా, ఈ ఘటనపై విచారణ నిమిత్తం పోలీస్ సిబ్బంది నిందితుడి ఇంటికి వెళ్లి పోలీస్ స్టేషన్‌కు రావాలని సూచించగా, నిందితుడు పోలీసులను దుర్భాషలాడి, విధులకు ఆటంకం కలిగించి, HC-65 గణేష్ కుమార్ పై దాడి చేసి గాయపరిచినట్లు విచారణలో తేలింది. సదరు కేసులో దర్యాప్తు అధికారి ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ G. శివరాముడు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు సిబ్బంది మరియు పెద్దమనుషుల సమక్షంలో దొరిగిల్లు గ్రామం మూడు రోడ్ల కూడలి వద్ద నిందితుడిని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు.
నిందితుడి గత నేర చరిత్ర:
అరెస్టు అయిన నంద్యాల చంద్ర మోహన్ పై గతంలో కూడా ఒక కేసు నమోదై ఉన్నది. కదిరి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మోటార్ సైకిల్ ప్రమాదానికి సంబంధించి Cr.No.109/2017 U/Sec.337 IPC కేసు నమోదై ఉన్నట్లు విచారణలో వెల్లడైంది.
ప్రస్తుతం నిందితుడిపై ముదిగుబ్బ (U/G) పోలీస్ స్టేషన్ Cr.No.66/2026 U/Sec.121(1) r/w 3(5) BNS మరియు Cr.No.65/2026 U/Sec.324(3), 126(2), 351(2) BNS & Sec.3 of PDPP Act కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నాము. అరెస్ట్ అనంతరం నిందితుడిని చట్ట ప్రకారం తదుపరి చర్యల నిమిత్తం గౌరవ న్యాయస్థానంలో హాజరు పరచడం జరుగుతుంది.
ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్
ముదిగుబ్బ (U/G) పోలీస్ స్టేషన్
శ్రీ సత్యసాయి జిల్లా
ప్రభుత్వ ఆస్తి ధ్వంసం, పోలీస్ సిబ్బందిపై దాడి, బెదిరింపుల కేసులో అరెస్ట్…
