నిరంతరం మానిటర్ చేయాలి: జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్..

*నిరంతరం మానిటర్ చేయాలి: జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్..*

– *: నగరంలోని సాయి నగర్ మూడవ క్రాస్ లో ఉన్న కెనరా బ్యాంక్ వద్ద నీట్ పునఃపరీక్ష పత్రాల నిల్వ కేంద్రంను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్..*

అనంతపురం, జూన్ 21 :

– *నేషనల్ ఎలిజిబులిటీ కం ఎంట్రెన్స్ టెస్ట్ (National Eligibility cum Entrance Test, NEET)ఫర్ అండర్ గ్రాడ్యుయేషన్ (యుజి) -2026 పునఃపరీక్ష ఈరోజు ఆదివారం మధ్యాహ్నం జరుగనున్న నేపథ్యంలో నేటి ఉదయం అనంతపురం నగరంలోని సాయి నగర్ మూడవ క్రాస్ లో ఉన్న కెనరా బ్యాంక్ వద్ద నీట్ పునఃపరీక్ష పత్రాల నిల్వ కేంద్రం నుండి ప్రశ్న పత్రాలను కట్టుదిట్టమైన భద్రత నడుమ సంబంధిత కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు, ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్, సిఆర్పిఎఫ్ కేంద్ర బలగాలు, కెనరా బ్యాంకు అధికారుల సమక్షంలో పారదర్శకంగా ప్రభుత్వ వాహనాల్లో అనంతపురము సంబంధించిన 7 కేంద్రాలవి తరలించడం జరిగింది. అలాగే గుత్తి పరిధిలోని రెండు కేంద్రాలకు కూడా గుత్తి కెనరా బ్యాంకు పరీక్ష పత్రాల కస్టోడియన్.*

– *నేషనల్ ఎలిజిబులిటీ కం ఎంట్రెన్స్ టెస్ట్ (National Eligibility cum Entrance Test, NEET)ఫర్ అండర్ గ్రాడ్యుయేషన్ (యుజి) -2026 పునఃపరీక్ష ఈరోజు ఆదివారం మధ్యాహ్నం జరుగనున్న నేపథ్యంలో నిరంతరం మానిటర్ చేయడం కొనసాగించాలని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆదివారం ఉదయం అనంతపురం నగరంలోని సాయి నగర్ మూడవ క్రాస్ లో ఉన్న కెనరా బ్యాంక్ వద్ద నీట్ పునఃపరీక్ష పత్రాల నిల్వ కేంద్రంను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.*

– *ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈరోజు మధ్యాహ్నం నీట్ పునఃపరీక్షను ఎలాంటి లోటుపాట్లు లేకుండా పటిష్టమైన బందోబస్తు మధ్య పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఏమైనా సమస్యలు ఉన్నా నోడల్ అధికారి మరియు డిఆర్ఓని సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ ఏ.మలోల, తదితరులు పాల్గొన్నారు.*

Posted Under AP
Editor