తాడిమర్రి (Yes9tv )మొహరం ఉత్సవాలకు ముందు అటవీ శాఖ అవగాహన కార్యక్రమం
పచ్చని చెట్లను నరకవద్దని గ్రామాల్లో విస్తృత ప్రచారం
తాడిమర్రి మండల పరిధిలోని పిన్నదరి, కునుకుంట్ల, ఎం.అగ్రహారం, నార్సింపల్లి గ్రామాల్లో మొహరం ఉత్సవాల సందర్భంగా పర్యావరణ పరిరక్షణపై అటవీ శాఖ ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. బుక్కపట్నం అటవీ క్షేత్రాధికారి యామిని సరస్వతి ఆదేశాల మేరకు గ్రామస్తులకు పచ్చని చెట్ల సంరక్షణ ప్రాముఖ్యతను వివరించారు.
మొహరం అగ్నిగుండాల కోసం పచ్చని చెట్లను నరికివేయకుండా ఎండిన కట్టెలు, కంపకట్టలు వంటి ప్రత్యామ్నాయాలను వినియోగించాలని సూచించారు. పచ్చని చెట్ల నరికివేత వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందని, భవిష్యత్ తరాలకు సహజ వనరులు అందుబాటులో ఉండాలంటే చెట్ల సంరక్షణ అత్యంత అవసరమని వివరించారు.
ఈ సందర్భంగా గ్రామాల్లోని ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక వీడియోలు, సందేశాలను వాట్సాప్ గ్రూపుల ద్వారా పంపిణీ చేయడం జరిగింది. పంచాయతీ సెక్రెటరీలు, వ్యవసాయ శాఖ, పశుసంవర్ధక శాఖ, రెవెన్యూ మరియు ఇతర శాఖల అధికారులు ప్రజలకు ఈ సందేశాన్ని విస్తృతంగా చేరవేయాలని అటవీ శాఖ కోరింది.
ప్రకృతి, పర్యావరణ పరిరక్షణతో పాటు సంప్రదాయాలను గౌరవించే విధంగా మొహరం ఉత్సవాలు నిర్వహించాలని బుక్కపట్నం అటవీ క్షేత్రాధికారి యామిని సరస్వతి విజ్ఞప్తి చేశారు.
సంప్రదించవలసిన వారు:
ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ జి. వెంకటరమణ
9440082805.
మొహరం ఉత్సవాలకు ముందు అటవీ శాఖ అవగాహన కార్యక్రమం…
