గాయపడిన విలేఖరికి అండగా గుమ్మనూరు జయరాం – రూ.25 వేల ఆర్థిక సహాయం….

కర్నూల్ జిల్లా..

సెంటర్ :ఆలూరు

*గాయపడిన విలేఖరికి అండగా గుమ్మనూరు జయరాం – రూ.25 వేల ఆర్థిక సహాయం..*

*పాత్రికేయుడి ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని మానవీయ స్పందన చూపిన మాజీ మంత్రివర్యులు ప్రస్తుతం గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం..*

–ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో ఆర్థిక సాయం – గుమ్మనూరు జయరాంకు కృతజ్ఞతలు…

చిప్పగిరి మండలానికి చెందిన విశాలాంధ్ర విలేఖరి ఈ నెల 12వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని, శనివారం ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో మాజీ మంత్రివర్యులు, ప్రస్తుతం గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం గారు రూ.25 వేల ఆర్థిక సహాయం అందించడం అభినందనీయమైన విషయం. ఈ సందర్భంగా బాధిత విలేఖరి తరఫున, అలాగే ఏపీయూడబ్ల్యూజే మరియు విశాలాంధ్ర కుటుంబం తరఫున గుమ్మనూరు జయరాం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. పాత్రికేయుల పట్ల చూపుతున్న ఈ మానవీయ దృక్పథం, అవసర సమయంలో అందిస్తున్న సహకారం ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొంటున్నాము. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే మండల అధ్యక్షుడు గోపాల్, ఉపాధ్యక్షులు గుత్తి నాగరాజు, ఏపీయూడబ్ల్యూజే నాయకులు డానియల్, యశోద్ కుమార్, రాము మోహన్, నారాయణ, చిన్న, హనుమేష్, బద్రి, ఆనంద్, కిరణ్, తదితరులు పాల్గొన్నారు.
ఇలాగే భవిష్యత్తులో కూడా ప్రజలకు, పాత్రికేయులకు అండగా నిలవాలని ఆకాంక్షిస్తూ మరోసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
– ఏపీయూడబ్ల్యూజే & విశాలాంధ్ర కుటుంబం

Posted Under AP
Editor