అనంతపురం జిల్లా రామనగర్
దివ్యాంగుల యోగ ప్రదర్శన ఏర్పాట్ల ను పరిశీలించిన జాయింట్ కలెక్టర్ సి. విష్ణు చరణ్
*
అనంతపురం, జూన్ 15:
రేపటి ఉదయం స్థానిక పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో దివ్యాంగుల కొరకు జిల్లా స్థాయికి థీమాటిక్ యోగ ప్రదర్శన కార్యక్రమం నిర్వహణ ఏర్పాట్లను జిల్లా జాయింట్ కలెక్టర్ సి.విష్ణు చరణ్ సోమవారం మధ్యాహ్నం వివిధ శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడుతూ రేపటి రోజున మంగళవారం ఉదయం జరగనున్న దివ్యాంగుల యోగ ప్రదర్శన కు సంబంధించిన ఏర్పాట్లను పకడ్బందీగా నిర్వహించే విధంగా అన్ని చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖ అధికారులను జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశించారు.
నేటి సాయంత్రంలోగా పనులన్నీ ఆయా శాఖల ఆధ్వర్యంలో పూర్తి చేయాలని సూచించారు.
సమాజంలో దివ్యాంగులకు శారీరక, మానసిక ఉల్లాసాన్ని ఆరోగ్యాన్ని చేకూర్చడమే లక్ష్యంగా ఈ ప్రత్యేక యోగా కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ పేర్కొన్నారు. ముఖ్యంగా దివ్యాంగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. సుదూర ప్రాంతాల నుండి వచ్చే దివ్యాంగుల కోసం ప్రత్యేక రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేయాలని వేదిక వద్దకు సులభతనంగా చేరుకునే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే తాగునీరు వైద్య సదుపాయాలు కార్యక్రమం సిబ్బంది ఏర్పాటు, విద్యుత్ సరఫరా, ప్రాంగణంలో సరిపడే విధంగా తాగునీటి వసతులతో పాటు దివ్యాంగులకు చేదోడుగా సహకరించే విధంగా స్వచ్ఛంద సేవకులను తగినంతమంది వాలంటీర్లను నియమించాలనిఆదేశించారు
ఈ కార్యక్రమంలో దివ్యాంగులు అధిక సంఖ్యలో పాల్గొని విజయంతం చేయాలని పిలుపునిచ్చారు. పనుల్లో ఎలాంటి నిర్లక్ష్యం వహించకుండా భద్ర యుతంగా పనులను పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. యోగ సునాలు చేసే వారికి అవసరమైన మేరకు మ్యాట్లను ఏర్పాటు చేయాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం మేరకు యోగాంధ్ర -20 26 లో భాగంగా
ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు ఒక గంట సేపు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో వేదిక ఏర్పాటు పారిశుధ్య పనులు చేపట్టాలని, వికలాంగుల సంక్షేమ శాఖ ద్వారా వికలాంగుల వసతి గృహాలు హోమ్స్ దివ్యాంగుల సంఘాల సభ్యులను మరియు ఆర్డిటి విద్యార్థులను భాగస్వామ్యం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రెవెన్యూ, పోలీస్, ఆయుష్, ఐ అండ్ పి ఆర్,ఆర్డబ్ల్యూఎస్, ఏపీ ఎస్పీడీసీఎల్, డీఈవో, డి ఆర్ డి ఏ, ఎస్ ఎస్ ఏ, తదితర శాఖ అధికారులకు కేటాయించిన పనులను సమన్వయంతో పూర్తిచేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సూచించారు. అనంతరం వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రత్యామ్నాయంగా యోగ ప్రదర్శన కోసం పోలీస్ లైన్ లోని శ్రీ కోదండ రామాలయం కళ్యాణ
మండపం మరియు ముస్లిం కమిటీ ఫంక్షన్ హాల్ ను వివిధ శాఖ అధికారులతో కలిసి జాయింట్ కలెక్టర్ పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ ఆర్డిఓ రామ్మోహన్, అహుడా సెక్రెటరీ రామకృష్ణారెడ్డి, మున్సిపల్ కమిషనర్ జస్వంత్, డి ఐ పి ఆర్ ఓ బాల కొండయ్య, ఆయుష్
డా. లా ల్య నాయక్, ఆర్ ఐ ఓ వెంకటరమణ నాయక్, రూరల్ తాసిల్దార్ ఉదయ భాస్కర్, డెమో నాగరాజు, ఆర్ ఐ లు తేజ సందీప్ తదితరులు పాల్గొన్నారు.
