అనంతపురం జిల్లా కలెక్టరేట్
జిల్లా స్థాయి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ నిర్వహణ..
అనంతపురం, జూన్ 15 :
– అనంతపురం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో సోమవారం జిల్లా స్థాయి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ నిర్వహించారు. ఇందులో 16 ఉద్యోగ సంఘాల అధ్యక్ష, ఉపాధ్యక్షులు హాజరై, వారి సమస్యలను తెలియజేశారు.
– ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ మాట్లాడుతూ ఉద్యోగ సంఘాల వారు తెలియజేసిన సమస్యలకు సంబంధించి తన పరిధిలో ఉన్నవి తక్షణమే పరిష్కరిస్తామన్నారు. మిగిలినవి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలియజేశారు. అనంతరం ఉద్యోగ సంఘాల వారు జిల్లా కలెక్టర్ కు వినతి పత్రాలను అందజేశారు. ఈ సమావేశంలో డిఆర్ఓ ఏ.మలోల, కలెక్టరేట్ ఏవో అలెగ్జాండర్, 16 ఉద్యోగ సంఘాల అధ్యక్ష, ఉపాధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు.
