రాయదుర్గం పట్టణాన్ని అభివృద్ధికి చిరునామాగా తీర్చిదిద్దుతాం: ఎమ్మెల్యే కాలవ.

అనంతపురం జిల్లా రాయదుర్గం

రాయదుర్గం పట్టణాన్ని అభివృద్ధికి చిరునామాగా తీర్చిదిద్దుతాం: ఎమ్మెల్యే కాలవ.

రాయదుర్గం పట్టణంలో మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. గత రెండు సంవత్సరాల కాలంలో పట్టణ అభివృద్ధి కోసం దాదాపు రూ.13 కోట్ల నిధులను ప్రత్యేకంగా సమీకరించి పలు అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నామన్నారు. రాయదుర్గం పట్టణంలోని 11వ వార్డు పరిధిలో రూ.10 లక్షల వ్యయంతో చేపట్టనున్న సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులకు సోమవారం ఆయన భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో రూ.60 లక్షల వ్యయంతో సుమారు 15 సిమెంట్ రోడ్డు పనులను త్వరలో ప్రారంభిస్తామన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉన్నా, మున్సిపాలిటీకి సొంత ఆదాయంతో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే అవకాశం లేకపోయినా, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక సహకారంతో ప్రభుత్వం నిధులను సమకూరుస్తోందన్నారు. ముఖ్యమంత్రి నేమకల్లు పర్యటన సందర్భంగా రాయదుర్గం మున్సిపాలిటీ ఆర్థిక పరిస్థితిని వివరించగా, రాబోయే ఐదేళ్లలో రూ.50 కోట్ల మేర నిధులు అందజేస్తామని ఆయన హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఆ హామీ మేరకు ఇప్పటికే వివిధ రూపాల్లో రూ.13కోట్ల నిధులు అందాయన్నారు. త్వరలో నిలిచిపోయిన రైల్వే వంతెన నిర్మాణ పనులను కూడా ప్రారంభిస్తామన్నారు. వచ్చే మూడు నెలల్లో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అలాగే రాయదుర్గం పట్టణంలో ఇంటింటికి స్వచ్ఛమైన తాగునీరు అందించే లక్ష్యంతో రూ.78 కోట్లతో అమృత్_2 పథకాన్ని ఇటీవల ప్రారంభించామన్నారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ పూర్తయితే రాయదుర్గంలో దాదాపు రూ.140 కోట్ల విలువైన అభివృద్ధి పనులు అమలైనట్లు అవుతుందని వివరించారు. వీటితోపాటు భవిష్యత్తులో మరిన్ని నిధులు తీసుకువచ్చి రాయదుర్గం పట్టణాన్ని రాష్ట్రంలో ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామన్నారు. రాయదుర్గం పట్టణ ప్రజలు తనకు 16 వేల మెజార్టీ ఇచ్చారని, వారి రుణం తీర్చుకోవడం కోసం అందుబాటులో ఉన్న ప్రతి అవకాశాన్ని వినియోగించి మరింత అభివృద్ధి సాధిస్తామని ఎమ్మెల్యే కాలవ స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు బండి కృష్ణ మూర్తి, మాజీ కౌన్సిలర్లు బండి భారతి, కురుబ ప్రశాంతి, పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ పోరాళ్ల పురుషోత్తం, మాజీ చేనేత కార్పొరేషన్ డైరెక్టర్ టoకశాల హనుమంతు, పూజారి శివ,డబ్బిడి శివ, సుమలత,గుద్దిటి లోకేష్,రావుత్ రాజశేకర్,ఏళ్లప్ప, ఆటో మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

Posted Under AP
Editor