ఎరువుల దుఖాణాన్ని తనిఖీ చేసిన కలెక్టర్..,

ఎరువుల దుఖాణాన్ని తనిఖీ చేసిన కలెక్టర్..
ముదిగుబ్బ yes9 TV
ముదిగుబ్బలోని రైతు సేవా ఆగ్రో కెమికల్స్ ఎరువుల దుకాణాన్ని శ్రీ సత్య సాయి జిల్లా కలెక్టర్ శ్రీ శ్యాం ప్రసాద్ గురువారం తనిఖీ చేశారు… ఏపీ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ఆన్లైన్ ఎరువుల పంపిణీ విధానం ను పరిశీలించారు.. దీని ప్రకారం ఏపి ఏఐఎంఎస్ 2.0 (APAIMS 2.0)యాప్ ద్వారా ఈ కొత్త ప్రక్రియను డీలర్లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ యాప్ ద్వారా యూరియా, డిఏపీలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.e – పంట ఆధారంగా సిఫారసు ఎరువులు రైతు సాగుచేసిన పంటను బట్టి ఈ యాప్ ద్వారా రైతుకు కేటాయించడం జరుగుతుందని తెలిపారు. దీనివల్ల రైతులకు ఎరువులపై పెట్టే అనవసర ఖర్చులు తగ్గుతాయని తెలిపారు.దీనిపై రైతులలో అవగాహన కల్పించాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు.ఆన్లైన్ ఎరువుల పంపిణీ విధానంలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని వ్యవసాయాధి కారులను కోరారు. ఆన్లైన్ విధానంలో రైతులకు ఎటువంటి సమస్యలు తలెత్తినా సంబంధిత రైతు సేవా కేంద్ర సిబ్బందిని సంప్రదించాలని తెలిపారు.కార్యక్రమంలో కదిరి ఏ డి ఏ సనావుల్లా, తహసీల్దార్ మహేశ్వర రెడ్డి,మండల వ్యవసాయ అధికారి రవీంద్ర,ఏ ఈ ఓ లక్ష్మీనారాయణప్ప, ఎంపీఈవో నాగరాజు,రైతులు పాల్గొన్నారు…

Posted Under AP
Editor