అనంతపురం జిల్లా రాయదుర్గం
రెండేళ్ల పాలనా కానుకగా చంద్రబాబు పార్కు
-ఎమ్మెల్యే కాలవ.
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిపాలనకు రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఆయన పేరిట పార్కును పారంభించడం ఆనందంగా ఉందని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. పట్టణంలోని బళ్లారిరోడ్డులోని శాంతినగరులో రూ.40 లక్షల వ్యయంతో ఆధునికీకరించిన చంద్రబాబు నాయుడు పార్కును గురువారం సాయంత్రం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, సుమారు 30 సంవత్సరాల క్రితం అప్పటి మున్సిపల్ చైర్మన్ పూజారి జితేంద్రప్ప ఆధ్వర్యంలో ఈ పార్కును ఏర్పాటు చేశారన్నారు. తరువాత సరైన నిర్వహణ లేక పార్కు ఆనవాళ్లు మాయమయ్యాయన్నారు. ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈ పార్కును తిరిగి అభివృద్ధి చేయాలని నిర్ణయించి, అధికారంలోకి వచ్చిన తరువాత రూ.40 లక్షలతో సమగ్రంగా ఆధునికీకరించినట్లు చెప్పారు.
పార్కుకు కొత్త రూపు తీసుకువచ్చి, పిల్లలు ఆడుకునేందుకు, కుటుంబాలు ఆహ్లాదకర వాతావరణంలో సమయం గడపడానికి అనుకూలంగా తీర్చిదిద్దినట్లు తెలిపారు. ముఖ్యంగా శాంతినగర్ పరిసర కాలనీల ప్రజలకు ఇది ఉపయోగకరంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రజలంతా దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో పట్టణ శివార్ల ప్రాంతంలో నగరవనాన్ని అభివృద్ధి చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుతం దానిని మరింత అభివృద్ధి చేసే చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. పట్టణంలోని ఇతర పార్కులను కూడా దశలవారీగా అభివృద్ధి చేసి, రాయదుర్గం ప్రజలకు మరిన్ని ఆహ్లాదకర వేదికలను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే కాలవ స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు బండి కృష్ణ మూర్తి, మాజీ చేనేత కార్పొరేషన్ డైరెక్టర్ టoకశాల హనుమంతు,భలే శంకర్ ,ఎల్లప్ప,పూజారి శివ, నాయకుల తిప్పస్వామి, మల్లికార్జున,రావుత్ రాజశేఖర్, వేణు, తదితరులు పాల్గొన్నారు.
