అనంతపురం జిల్లా రాయదుర్గం
* అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
* బొలెరో వాహనము , ఒక ద్విచక్ర వాహనం, రూ. 40 వేలు నగదు స్వాధీనం చేసుకున్న పోలీసులు
ఆంధ్ర, కర్ణాటక,
సరిహద్దులలో వాహనాలు, పశువుల దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాకు చెందిన ఇద్దరు నిందితులను అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని డి.హీరేహాళ్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు రాయదుర్గం రూరల్ సీఐ వెంకటరమణ తెలిపారు.
ఈ మేరకు రాయదుర్గం రూరల్ పోలీస్ సర్కిల్ కార్యాలయంలో సిఐ వెంకటరమణ డి. హిరేహాల్ si గురు ప్రసాద్ రెడ్డి తో కలిసి మీడియా సమావేశంలో నిందితుల అరెస్టు చూపుతూ వివరాలు వెల్లడించారు.
కర్ణాటకలోని రాయచూర్ జిల్లా సిందనూరు పట్టణానికి చెందిన భీమేష్ (26), సురేష్@సూరి (23) లను గురువారం డి.హీరేహాళ్ వంక వద్ద బొలెరో లోకి బైక్ ఎక్కిస్తుండగా రాయదుర్గం రూరల్ సిఐ వెంకటరమణ, SI గురుప్రసాద్ రెడ్డి బృందం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది.
వారు కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్‌లో బొలెరో వాహనము, యాదగిరిలో హోండా షైన్ ద్విచక్ర వాహనం దొంగతనం చేశారు.
గత మే నెలలో డి.హీరేహాళ్ మండల కేంద్రంలో ఆవును దొంగిలించి బెంగళూరులో రూ.50 వేలకు విక్రయించారు.
– జూన్ 7న మరో ఆవు దొంగతనానికి యత్నించినట్లు తెలిపారు. వీరంతా 6 మంది దొంగలు కలిసి వాహనాలు, పశువులు, పందులు దొంగతనాలు చేయడం పట్టణాలు నగరాల్లో విక్రయించడం వంటివి చేస్తుంటారన్నారు.
బొలెరో వాహనం, హోండా షైన్ బైక్, ఆవు అమ్మగా వచ్చిన రూ.40,000/- నగదు పోలీసులు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
నిందితులపై 2023లో సిందనూరులో బైక్, బొలెరో దొంగతనం కేసులున్నాయి. మిగిలిన నలుగురు ముఠా సభ్యుల కోసం గాలింపు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.
కేసు ఛేదించిన డి. హిరేహాల్ SI గురుప్రసాద్ రెడ్డి, HC గంగన్న, శ్రీనివాసులు, కానిస్టేబుళ్లు నాగరాజు, రామాంజనేయులు, మల్లికార్జున, రమేష్‌ను ఉన్నతాధికారులు అభినందించారు.
