ఘాట్ రోడ్డు ప్రమాదాలకు బ్రేక్: ముదిగుబ్బ-పులివెందుల మార్గంలో సీఐ, ఆర్&బీ అధికారుల జాయింట్ ఆడిట్!

ముదిగుబ్బ Yes9tv
ముదిగుబ్బ నుండి పులివెందుల వేళ్ళు ఘాట్ రోడ్డు నందు ఈ మధ్య కాలంలో ఎక్కువ ప్రమాదాలు జరుతున్న సందర్బంగా… ఈ రోజు పులివెందుల ఆర్ & బి శాఖ ఏఈ మరియు ముదిగుబ్బ సీఐ ఇద్దరు పులివెందుల ఘాట్ రోడ్డులోని మలుపుల వద్ద జాగ్రత్త సూచిక బోర్డులు మరియు ఇతర రహదారి భద్రతా చర్యల ఏర్పాటు విషయమై సంయుక్త తనిఖీ నిర్వహించడమైనది.
ఈ సందర్భంగా ప్రమాదాలకు గురయ్యే మలుపులు, వాహనదారులకు కనిపించే దూరం, రహదారి పరిస్థితులు, హెచ్చరిక బోర్డుల ఏర్పాటు, వేగ నియంత్రణ చర్యలు మరియు వాహనదారులు, సాధారణ ప్రజల భద్రతకు అవసరమైన ఇతర అంశాలను పరిశీలించడమైనది.
అలాగే ప్రమాదకర ప్రాంతాలలో జాగ్రత్త సూచిక బోర్డులు, రిఫ్లెక్టివ్ సైన్ బోర్డులు, వేగ పరిమితి సూచికలు, హజార్డ్ మార్కర్లు మరియు ఇతర నివారణాత్మక భద్రతా ఏర్పాట్లు చేయవలసిందిగా సూచనలు ఇవ్వడమైనది.
ఈ తనిఖీ ప్రధాన ఉద్దేశ్యం రోడ్డు ప్రమాదాలను నివారించడం, ట్రాఫిక్ సాఫీగా సాగేందుకు చర్యలు తీసుకోవడం మరియు పులివెందుల ఘాట్ మార్గంలో ప్రయాణించే ప్రజలకు మెరుగైన రహదారి భద్రత కల్పించడమే.

Posted Under AP
Editor