Latest Posts

ఐఐపీఎం – రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ మధ్య అవగాహన ఒప్పందం..

ఐఐపీఎం – రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ మధ్య అవగాహన ఒప్పందం
బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాంటేషన్ మేనేజ్‌మెంట్ (IIPM) , భారత ప్రభుత్వ వాణిజ్య & పరిశ్రమల మంత్రిత్వ శాఖ మరియు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ (RTIH), అనంతపురము స్పోక్ కార్యాలయం మధ్య ఈరోజు పరస్పర సహకార అవగాహన ఒప్పందం (MoU) జిల్లా కలెక్టర్ శ్రీ ఓ. ఆనంద్, ఐఏఎస్ మరియు జాయింట్ కలెక్టర్ శ్రీ విష్ణు చరణ్ ఐఏఎస్ వారి సమక్షంలో ఘనంగా నిర్వహించబడింది.
IIPM డైరెక్టర్ డా. ఎస్. సెంథిల్ వినాయగం వ్యవసాయ వ్యాపారం, వ్యవసాయ విస్తరణ, గ్రామీణ వ్యవస్థాపకత రంగాల్లో విశేష అనుభవం కలిగిన ప్రముఖ విద్యావేత్త మరియు పరిశోధకులు. ఆయన నాయకత్వంలో IIPM సంస్థ అగ్రి-ఎగుమతులు, గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు, లైవ్‌లీహుడ్ బిజినెస్ ఇంక్యుబేషన్ యూనిట్లు, స్టార్టప్ అభివృద్ధి వంటి పలు వినూత్న కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తోంది.
ఈ ఒప్పందం ద్వారా వ్యవసాయం, ఆహార ప్రాసెసింగ్, అగ్రి-టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మార్కెట్ రీసెర్చ్, స్టార్టప్ ఇంక్యుబేషన్, నైపుణ్యాభివృద్ధి మరియు గ్రామీణ వ్యవస్థాపకత రంగాల్లో సంయుక్త కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆర్ టీ ఐ హెచ్ సీఈఓ డా ఆర్ హఫీజ్ భాష తెలిపారు.
అలాగే విద్యార్థులు, స్టార్టప్‌లు, యువ పారిశ్రామికవేత్తలకు శిక్షణలు, మెంటరింగ్, పరిశోధన సహకారం, ఇన్నోవేషన్, ఉద్యాన పంటల ఎగుమతులు ద్వారా ద్వారా ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి ఈ భాగస్వామ్యం దోహదపడనుంది.

Posted Under AP
Editor