Latest Posts

చిల్లకొండయ్యపల్లిలో గ్యాస్ రాక ప్రజల తీవ్ర ఇబ్బందులు; కట్టెల పొయ్యే దిక్కంటూ మహిళల ఆవేదన.. అధికారులు స్పందించాలని డిమాండ్

తాడిమర్రి(Yes9tv )గ్యాస్ రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న చిల్లకొండయ్యపల్లి గ్రామ ప్రజలు
అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తుల ఆవేదన
శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం తాడిమర్రి మండలం చిల్లకొండయ్యపల్లి గ్రామంలో గత కొన్ని రోజులుగా గ్యాస్ సరఫరా సక్రమంగా లేకపోవడంతో గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంటింటా వంట గ్యాస్ అందక మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గ్యాస్ బుకింగ్ చేసినప్పటికీ రోజుల తరబడి సిలిండర్లు అందక ప్రజలు కట్టెల పొయ్యిలపై వంట చేసుకునే పరిస్థితి ఏర్పడిందని గ్రామస్తులు వాపోతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు ఉన్న కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని తెలిపారు.
గ్రామానికి సరైన సమయానికి గ్యాస్ వాహనం రాకపోవడం, డెలివరీలో ఆలస్యం జరగడం వల్ల ప్రజలు అదనపు ఖర్చులు పెట్టి ఇతర ప్రాంతాల నుండి గ్యాస్ తెప్పించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. కొంతమంది గ్రామస్తులు బ్లాక్‌లో అధిక ధరలకు సిలిండర్లు కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు.
వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో కట్టెలతో వంట చేయడం మరింత కష్టంగా మారుతుందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో గ్యాస్ సరఫరా వ్యవస్థను వెంటనే మెరుగుపరచాలని, ప్రతి కుటుంబానికి సమయానికి సిలిండర్లు అందేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు.

Posted Under AP
Editor