ఆంధ్ర విద్యార్థి సంఘం
అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గం గుంతకల్ పట్టణంలో ఉన్నటువంటి శ్రీ సాయిబాబా ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో బోయ భారతి అనే ఒక విద్యార్థిని 10 వ తరగతి శ్రీ సాయిబాబా ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో చదువుతుంది . ఈ విద్యార్థిని 4వ తరగతి నుంచి 10 వ తరగతి వరకు చదివింది అయినప్పటికీ ఈ విద్యార్థిని ఆదర్శ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో చదువుతుంది అన్నట్టు 10 వ తరగతి SSC హాల్ టికెట్ లో రావడం జరిగింది. ఇక్కడ గమనిస్తే 4 వ తరగతి నుంచి 10 వ తరగతి వరకు *శ్రీ సాయి బాబా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివితే ఆదర్శ స్కూల్లో ఎలా వస్తుందని ఈ సందర్భంగా *ఆంధ్ర విద్యార్థి సంఘం అనంతపురం జిల్లా అధ్యక్షులు వాల్మీకి వంశీ గారు మాట్లాడుతూ గుంతకల్ పట్టణంలో విద్యను దోపిడీ చేస్తూ ఇలాంటి ఇల్లీగల్ పనులు చేస్తున్నటువంటి *శ్రీ సాయిబాబా ఇంగ్లీష్ మీడియం స్కూల్ పై తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా గుంతకల్ పట్టణంలో ఉన్నటువంటి స్కూల్స్ వారికి ఏ బుక్ స్టాల్ లో అయితే కమిషన్ వస్తుందో ఆ బుక్ స్టాల్ కి స్కూల్ వాళ్ళు రిఫర్ చేస్తున్నారు ఇది ఎంతవరకు సమన్యసం అదేవిధంగా విద్యను దోపిడీ చేస్తున్నటువంటి ఇలాంటి స్కూల్ పై చర్యలు తీసుకోవాలని తీవ్రంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో *AVS (ఆంధ్ర విద్యార్థి సంఘం) నాయకులు ఆజాద్, వెంకటేశ్వర్ రెడ్డి, ప్రతాప్, సంతోష్, అర్జున్, విద్యార్థిని తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు
శ్రీ సాయిబాబా స్కూల్లో చదివితే ఆదర్శ స్కూల్ అని హాల్ టికెట్ రావడంపై ‘ఏవీఎస్’ ఆగ్రహం; ఇల్లీగల్ పనులపై చర్యలు తీసుకోవాలని వాల్మీకి వంశీ డిమాండ్
