మాజీ ఎంపీటీసీ సభ్యురాలు చదివే వెంకట లక్ష్మమ్మ మృతి

  • మాజీ ఎంపీటీసీ సభ్యురాలు చదివే వెంకట లక్ష్మమ్మ మృతి
  • నివాళులర్పించిన మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి గారు

శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ మండలనికి చెందిన టిడిపి నాయకురాలు మాజి M.P.T.C చదివే వెంకట లక్ష్మమ్మ అనారోగ్య కారణంగా నిన్నటి రోజున మరణించారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి గారు శనివారం ఉదయం గ్రామానికి చేరుకుని పార్థివ దేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి అండగా ఉంటామని భరోసా కల్పించారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Posted Under AP
Editor