శ్రీ సత్యసాయి జిల్లా, కదిరి.
పెట్రోల్ డీజిల్ ధరల పెంపును వ్యతిరేకిస్తూ ఆటోలను తాళ్ళతో లాగుతూ వినూత్న నిరసన తెలిపిన సిపిఎం
శ్రీ సత్య సాయి జిల్లా కదిరి
పెట్రోల్ డీజిల్ ధరల పెంపును ఖండిస్తూ పట్టణంలోని అంబేద్కర్ కూడలి నందు సిపిఎం నాయకులు నిరసన చేపట్టారు.
రెండు ఆటోలను తాళ్లతో లాగుతూ పట్టణమంతా వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు.
సిపిఎం నాయకులు జిఎల్ నరసింహులు మాట్లాడుతూ యుద్దాన్ని సాకుగా చూపిస్తూ చమురు కంపెనీలకు ధరలు పెంచుకునే వీలు కల్పించి సామాన్యుడి నడ్డి విరిచిన కేంద్ర ప్రభుత్వం, చమురు కంపెనీలకు లబ్ధి చేకూర్చే విధంగా వ్యవహరించడంపై కేంద్ర ప్రభుత్వంపై సిపిఎం నాయకులు మండిపడ్డారు.
ఇప్పటికైనా పెంచిన ధరలు తగ్గించి నిత్యావసర సరుకుల ధరలు పెరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
బైట్స్..
సిపిఎం నరసింహులు
