అనంతపురం జిల్లా,రాయదుర్గం.
అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కాలవ శ్రీనివాసులు పిలుపునిచ్చారు. శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా రాయదుర్గం పట్టణంలోని గుమ్మగట్ట రోడ్డులో అధికారులు, టీడీపీ నాయకులతో కలిసి ఆయన శ్రమదానం నిర్వహించారు.
ఈ సందర్భంగా పట్టణంలోని 32 వార్డుల్లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమానికి ముందు పారిశుద్ధ్య సిబ్బంది, ఉద్యోగులతో కలిసి స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించారు. ప్రతిరోజూ కొంత సమయం కేటాయించి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ కోసం కృషి చేయాలని ప్రజలను కోరారు. రాయదుర్గాన్ని సుందరమైన, స్వచ్ఛమైన పట్టణంగా తీర్చిదిద్దేందుకు ప్రజల భాగస్వామ్యం అవసరమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డి, డీఈ సురేష్, ఏఈ నరసింహులు, టీడీపీ నాయకులు టంకశాల హనుమంతు, పురుషోత్తం, పసుపులేటి నాగరాజు, గాజులు వెంకటేశులు, జనసేన నాయకుడు మంజునాథ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
