బత్తలపల్లి ఆర్డిటి ఆసుపత్రిని సందర్శించిన రాష్ట్ర మంత్రివర్గం
శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లి మండల కేంద్రంలోని ఆర్డిటి (RDT) ఆసుపత్రిని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రివర్యులు నారా లోకేష్ సందర్శించారు. ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవలు, సదుపాయాలను పరిశీలించి, వైద్య సిబ్బందితో మరియు నిర్వాహకులతో చర్చించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్, రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ మంత్రివర్యులు అనగాని సత్యప్రసాద్, రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమం, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం, చేనేత మరియు జౌలి శాఖ మంత్రివర్యులు ఎస్. సవిత పాల్గొన్నారు.
అలాగే ప్రభుత్వ విప్ మరియు రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు, హిందూపురం పార్లమెంట్ సభ్యులు బి.కె. పార్థసారథి, మడకశిర ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజు, సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి తదితర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రివర్గం ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవల నాణ్యతను ప్రశంసిస్తూ, గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఆర్డిటి సంస్థ నిర్వహిస్తున్న సేవలు ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నాయని కొనియాడారు.
అధికారులు, స్థానిక నాయకులు మరియు వైద్య సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
బత్తలపల్లి ఆర్డిటి ఆసుపత్రిని సందర్శించిన రాష్ట్ర మంత్రివర్గం…
