- నేడు మంత్రి సత్య కుమార్ యాదవ్
- పుట్టపర్తి – ధర్మవరం – అనంతపురంలో మంత్రి సత్య కుమార్ యాదవ్ విస్తృత పర్యటన
- అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి సత్య కుమార్ యాదవ్
- ఎయిర్‌క్రాఫ్ట్ టెస్ట్ సెంటర్ శంకుస్థాపనకు హాజరుకానున్న మంత్రి సత్య కుమార్ యాదవ్
- పిఎంఏవై(PMAY) గృహాలను ప్రారంభించనున్న మంత్రి సత్యకుమార్ యాదవ్
- APTIDCO అధికారులతో సమీక్షా సమావేశంలో పాల్గొననున్న మంత్రి సత్యకుమార్ యాదవ్
- లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందించనున్న మంత్రి సత్యకుమార్ యాదవ్
– రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్య శాఖామాత్యులు, ధర్మవరం శాసనసభ్యులు సత్య కుమార్ యాదవ్ గారు మే 15 మరియు 16 తేదీల్లో పుట్టపర్తి, ధర్మవరం మరియు అనంతపురం ప్రాంతాల్లో విస్తృత పర్యటన నిర్వహించనున్నట్లు మంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ పర్యటనలో భాగంగా అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు కార్యక్రమాలు, సమీక్షా సమావేశాలు మరియు బీజేపీ ప్రశిక్షణ కార్యక్రమాల్లో మంత్రి పాల్గొననున్నట్లు వివరించింది. శుక్రవారం ఉదయం 10:00 గంటలకు పుట్టపర్తిలో ఏరోనాటికల్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న ఎయిర్‌క్రాఫ్ట్ ఇంటిగ్రేషన్ & ఫ్లైట్ టెస్ట్ సెంటర్‌కు నిర్వహించే శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి సత్య కుమార్ యాదవ్ పాల్గొంటారు. ఈ ప్రాజెక్ట్ ప్రాంతీయ అభివృద్ధికి, సాంకేతిక రంగ ప్రోత్సాహానికి దోహదపడనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం మధ్యాహ్నం 3:00 గంటలకు ధర్మవరం ఎన్డీఏ కార్యాలయంలో ప్రజలు, పార్టీ నాయకులు మరియు కార్యకర్తలకు అందుబాటులో ఉంటారు. ప్రజల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు మంత్రి కార్యాలయం తెలిపింది. తర్వాత సాయంత్రం 4:00 గంటలకు ధర్మవరం ఎన్డీఏ కార్యాలయంలో నిర్వహించే ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు చెక్కులు అందజేస్తారు. అనంతరం సాయంత్రం 5:00 గంటలకు ధర్మవరం పట్టణంలోని CNB ఫంక్షన్ హాల్ సమీపంలోని శివాలయం వద్ద ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (PMAY) కింద నూతనంగా నిర్మించిన గృహాలను మంత్రి ప్రారంభిస్తారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా అర్హులైన పేద కుటుంబాలకు గృహ సౌకర్యాలు కల్పించడం జరుగుతోందని మంత్రి కార్యాలయం పేర్కొంది. అదేవిధంగా శనివారం ఉదయం 10:00 గంటలకు ధర్మవరం ఎన్డీఏ కార్యాలయంలో APTIDCO అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో మంత్రి పాల్గొంటారు. గృహ నిర్మాణ ప్రాజెక్టుల పురోగతి, ప్రజలకు అందుతున్న సదుపాయాలపై సమీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం మధ్యాహ్నం 3:00 గంటలకు అనంతపురం జిల్లా, మన్నిల గ్రామంలోని శ్రీ కృష్ణ గార్డెన్స్‌లో నిర్వహించే బీజేపీ ప్రశిక్షణా కార్యక్రమంలో మంత్రి సత్య కుమార్ యాదవ్ పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ రెండు రోజుల పర్యటనలో మంత్రి సత్య కుమార్ యాదవ్, అభివృద్ధి కార్యక్రమాల అమలు, సంక్షేమ పథకాల పురోగతి మరియు ప్రజల సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు మంత్రి కార్యాలయం పేర్కొంది.
జారీచేసిన వారు : రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, వైద్య విద్య శాఖామాత్యుల వారి కార్యాలయం.
