దేశానికి రక్షణ కవచంలా రాయలసీమ ప్రాజెక్టులు…….

 

*దేశానికి రక్షణ కవచంలా రాయలసీమ ప్రాజెక్టులు*

*రూ.15,803 కోట్లతో AMCA ప్రాజెక్టుకు పుట్టపర్తిలో శంకుస్థాపన*

*డిఫెన్స్, డ్రోన్ రంగాల్లో మరో 12 ప్రాజెక్టులకూ భూమి పూజ*

*శుక్రవారం రక్షణ మంత్రితో కలిసి భూమిపూజ చేయనున్న సీఎం చంద్రబాబు*

*అమరావతి, మే 14:* రాయలసీమ రతనాల సీమ… ఇది చరిత్ర. ఉద్యాన సీమ… ఇది వర్తమానం. రక్షణ సీమ… ఇది భవిష్యత్. ఇరిగేషన్, హర్టికల్చర్, స్పేస్, డ్రోన్, సోలార్, విండ్ ఎనర్టీ వంటి రంగాల్లో దూసుకెళ్తున్న రాయలసీమ డెవలప్మెంట్ జర్నీలో మరో కీలక రంగం జత కానుంది. ఇకపై రాయలసీమ దేశ రక్షణ రంగంలోనూ తన ముద్రను వేయబోతోంది. ప్రత్యేకతను చాటుకోనుంది. శుక్రవారం శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో దేశం గర్వించే అత్యంత ప్రతిష్టాత్మకమైన అడ్వాన్స్‌డ్ మీడియం కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (AMCA) డిఫెన్స్ ప్రాజెక్టును ఏరో నాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ-డీఆర్డీఓ సంస్థలు సంయుక్తంగా ఏర్పాటు చేయనున్నాయి. కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్‌తో కలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భూమి పూజ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ పాల్గొననున్నారు. రూ.15,803 కోట్లతో, 650 ఎకరాల్లో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకోనుంది. ఇది భారతదేశపు మొట్టమొదటి 5th Generation స్టెల్త్ మల్టీ-రోల్ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ ప్రాజెక్ట్. ఇందులో స్టెల్త్ టెక్నాలజీ, ట్విన్ ఇంజిన్ సూపర్ క్రూయిజ్ సామర్థ్యం, అత్యాధునిక ఏవియానిక్స్ వంటి హంగులతో యుద్ద విమానాలను అభివృద్ధి చేయనున్నారు. యుద్ద విమానాలను పుట్టపర్తిలోనే అభివృద్ధి చేయడంతోపాటు… టెస్టింగ్ కూడా చేపట్టేలా ప్రాజెక్టును రూపొందించారు. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 7,500 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అంచనా. అలాగే ఈ ప్రధాన ప్రాజెక్టుకు అనుబంధంగా వచ్చే ఇతర యూనిట్ల ద్వారా రూ.1 లక్ష కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. దీని కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా 400 ఎకరాలు కేటాయించింది. వీటితో పాటు కర్నూలు జిల్లాలో నిర్మిస్తోన్న ‘డ్రోన్ సిటీ’ ద్వారా భారతదేశంలోనే అత్యుత్తమ డ్రోన్ ఎకోసిస్టమ్‌ను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. AMCA ప్రాజెక్టుతో పాటు డిఫెన్స్ రంగానికి చెందిన 4 ప్రాజెక్టులు, 8 డ్రోన్ ప్రాజెక్టులకు శంకుస్థాపన జరగనుంది. ఈ 12 ప్రాజెక్టుల ద్వారా రూ.4145 కోట్ల పెట్టుబడులు, 6,071 మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. వీటిల్లో మడకశిరలో రెండు ప్రాజెక్టులు, దొనకొండ, నెల్లూరుల్లో ఒక్కో ప్రాజెక్టు ఏర్పాటు కానుంది. మిగిలిన 8 డ్రోన్ ప్రాజెక్టులు కర్నూలు జిల్లాలోని డ్రోన్ సిటీలో నిర్మాణాలు చేపట్టనున్నాయి.

*మరో 12 ప్రాజెక్టులకు శంకుస్థాపన…:*

*డిఫెన్స్ ప్రాజెక్టులు*
• కళ్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్స్ లిమిటెడ్ – రూ. 1430 కోట్ల పెట్టుబడి – 565 మందికి ఉపాధి
• భారత్ డైనమిక్స్ లిమిటెడ్ – రూ. 489 కోట్ల పెట్టుబడి – 500 మందికి ఉపాధి
• HFCL – రూ. 1040 కోట్ల పెట్టుబడి – 870 మందికి ఉపాధి
• ప్రీమియర్ ఎక్స్ ప్లోజివ్స్ – రూ. 500 కోట్ల పెట్టుబడి – 2050 మందికి ఉపాధి

*డ్రోన్ ప్రాజెక్టులు*
• అల్గోబాటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ – రూ. 34 కోట్ల పెట్టుబడి – 52 మందికి ఉపాధి
• డ్రోగో డ్రోన్స్ ప్రైవేట్ లిమిటెడ్ – రూ. 255 కోట్ల పెట్టుబడి – 850 మందికి ఉపాధి
• డ్రోన్ ల్యాబ్ టెక్నాలజీస్ – రూ. 5 కోట్ల పెట్టుబడి – 14 మందికి ఉపాధి
• హెచ్ సి రోబోటిక్స్ – రూ. 100 కోట్ల పెట్టుబడి – 500 మందికి ఉపాధి
• సెన్స్ ఇమేజ్ టెక్నాలజీస్ – రూ. 68 కోట్ల పెట్టుబడి – 45 మందికి ఉపాధి
• ఎయిర్ పేస్ ఇండస్ట్రీస్ – రూ. 100 కోట్ల పెట్టుబడి – 150 మందికి ఉపాధి
• జేడీకే ఫ్లై డ్రోన్ వరల్డ్ – రూ. 114 కోట్ల పెట్టుబడి – 350 మందికి ఉపాధి
• లాట్రిక్ ఎయిరో స్పేస్ – రూ. 10 కోట్ల పెట్టుబడి – 125 మందికి ఉపాధి

*ముఖ్యమంత్రి పర్యటన షెడ్యూల్…*

ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన ఉదయం 08:15 గంటలకు ఉండవల్లి క్యాంప్ కార్యాలయం నుంచి బయలుదేరి 09:45 గంటలకు పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకుంటారు. ఉదయం 10:15 గంటలకు శంకుస్థాపన కార్యక్రమ వేదిక వద్దకు చేరుకుంటారు. ఉదయం 10:15 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు AMCA ప్రాజెక్టుకు శంకుస్థాపనతో పాటు వివిధ డిఫెన్స్, డ్రోన్ ప్రాజెక్టులకు భూమి పూజను రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో కలిసి సీఎం చంద్రబాబు చేస్తారు. అనంతరం మధ్యాహ్నం 02:20 గంటలకు తిరిగి అమరావతి చేరుకుంటారు.

Posted Under AP
Editor