కెనరా బ్యాంకుకు తాళం వేసి నిరసన వ్యక్తంచేసిన సిపిఐనాయకులు, రైతులు,

ముదిగుబ్బ యస్ 9
ముదిగుబ్బ మండలం లోని రైతులను
పంటరుణాల రెన్యువల్లో ఇబ్బంది పెడుతున్న కెనరా బ్యాంకు అధికారులు..

ముదిగుబ్బ మండలంలోని ఫ్రీ హోల్డ్ భూముల రైతులకు ఎటువంటి షరతులు లేకుండా గతంలో మాదిరే రెన్యువల్ చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ పార్టీ నాయకులు రైతులు గురువారం ముదిగుబ్బ పట్టణంలోని కెనరా బ్యాంకుకు తాళం వేసి వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు, సిపిఐ నాయకులు కెనరా బ్యాంక్ మేనేజర్ తో మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఫ్రీ ఓల్డ్ భూముల రైతులకు, రీ సర్వే కాబడిన రైతులకు లేనిపోని నిబంధనలు పెడుతూ ఆ భూముల రైతులకు ఎన్ని ఎకరాలు ఉన్న కేవలం రెండు లక్షలు మాత్రమే రుణం మంజూరు చేస్తామని చెప్పడమే గాక గతంలో ఎక్కువ రుణము తీసుకొని ఉంటే ఆ మొత్తాన్ని కూడా వెనక్కి చెల్లించాలని లేకపోతే రెన్యువల్ చేయమని చెప్పడం దారుణమని మేనేజరతో వాదించారు…ఇప్పటికే పంటలు పండక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్న రైతన్నలను తిరిగి రుణాన్ని వెనక్కి చెల్లించాలని డిమాండ్ చేయడం సరికాదని సిపిఐ నాయకులు బ్యాంక్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ సమస్యను పరిష్కరించాలని తరచూ విన్నవిస్తున్న కనీస స్పందన లేదని సిపిఐ నాయకులు బ్యాంక్ నూతన మేనేజర్ కు తెలిపారు, ఇప్పటివరకు కూడా బ్యాంక్ వారు రెవెన్యూ అధికారులు సమన్వయంతో పనిచేయక రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో బ్యాంకుల్లో రైతులకు ఈ దుర్భర పరిస్థితి దాపురిస్తోందని సిపిఐ నాయకులు చల్లా శ్రీనివాసులు మేనేజర్ తో చర్చించారు..కనుక ఇప్పటికైనా
ఫ్రీ హోల్డ్ భూముల రైతుల పంట రుణాలను తక్షణమే ఎటువంటి షరతులు లేకుండా రెన్యువల్ చేయాలని కోరారు, అదేవిధంగా రెన్యువల్ చేయడానికి అవసరమయ్యే బాండ్ పేపర్లను కూడా రైతులకు బ్యాంకు వారే ఉచితంగా అందజేయాలన్నారు వేసవికాలం దృష్ట్యా బ్యాంకుకు వచ్చే రైతులకు ముఖ్యంగా వృద్ధులకు, వికలాంగ రైతులకు తగిన సౌకర్యాలు కల్పించాలన్నారు,
పై సమస్యలను తక్షణమే పరిష్కరించకపోతే త్వరలోనే సంబంధిత రైతులతో కలిసి మరింత పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపడతామని ఈ సందర్భంగా సిపిఐ పార్టీ నాయకులు చల్లా శ్రీనివాసులు బ్యాంకు అధికారులకు తెలియజేశారు, ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ స్థానిక నాయకులు ఆదినారాయణ, తుమ్మల చిన్నన్న ,రవి, శంకర, రమేష్ నాయుడు, ప్రసాద నాయక్ , ఏ రామంజి, సరస్వతి భాయ్, రమణమ్మ, చెన్నప్ప తదితరులు పాల్గొన్నారు,

Posted Under AP
Editor