గంభిరావుపేటలో ఘోర ప్రమాదం: బస్టాండ్ వద్ద నిలబడ్డ వారిపైకి దూసుకెళ్లిన స్కార్పియో

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభిరావుపేట మండలం గజసింగవరం బస్టాండ్ వద్ద బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు కోసం ఎదురుచూస్తున్న ఇద్దరు మహిళలు, ఓ చిన్నారిని అతివేగంగా వచ్చిన వైట్ కలర్ స్కార్పియో వాహనం ఢీకొట్టడంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.

స్థానికుల కథనం ప్రకారం.. గజసింగవరం బస్టాండ్ వద్ద మహిళలు చిన్నారితో కలిసి బస్సు కోసం వేచి ఉండగా, బస్సు వస్తున్న సమయంలో వెనుక నుంచి అతి వేగంగా వచ్చిన స్కార్పియో వాహనం ఒక్కసారిగా వారిపైకి దూసుకొచ్చింది. ఢీకొన్న తీవ్రతకు బాధితులు గాల్లోకి ఎగిరిపడి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని అశ్విని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితులకు చికిత్స కొనసాగుతుండగా, వారి ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని

Posted Under AP
Editor