*రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి.. మరొకరికి తీవ్ర గాయాలు*
సీతానగరం: పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలం గుచ్చిమి పెట్రోల్ బంక్ వద్ద బుధవారం ఓ ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పార్వతీపురం మండలం జమదాల గ్రామానికి చెందిన అల్లు రోహిత్ (16), నిమ్మకజన్నీ చంద్రశేఖర్ డీజిల్ కోసం ద్విచక్ర వాహనంపై బంకుకు బయలుదేరారు. మార్గంమధ్యలో 36వ నంబరు రాష్ట్ర రహదారిని దాటి పెట్రోల్ బంక్ వైపు వెళుతుండగా కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో రోహిత్ అక్కడికక్కడే మృతి చెందగా, చంద్రశేఖర్ తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రుడ్ని జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై ఏఎస్సై లక్ష్మణరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అల్లు రోహిత్కు ట్రాక్టర్ ఉండటంతో దానికి డీజిల్ తీసుకువచ్చేందుకు వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యాడు.
