Latest Posts

ఏసీపీ ఇంట్లో పేలిన గ్యాస్ సిలిండర్, ఏసీ కంప్రెసర్…

విజయవాడ.

 

విజయవాడ నగరంలోని ఏసీపీ సత్యానంద్ నివాసంలో గ్యాస్ సిలిండర్, ఏసీ కంప్రెషర్ పేలాయి. పటమటలంకలోని ప్రత్యూష అపార్ట్మెంట్ మూడో అంతస్తులో ఈ ఘటన చోటుచేసుకుంది. బాల్కనీలోని ఏసీ కంప్రెషర్కు షార్ట్సర్క్యూట్ కారణంగా పేలుడు సంభవించినట్లు పోలీసుల ప్రాథమికంగా భావిస్తున్నారు. ఏసీ కంప్రెషనర్ నుంచి వచ్చిన మంటలు గ్యాస్ సిలిండర్కు అంటుకోవడంతో ప్రమాద తీవ్రత పెరిగినట్లు అనుమానిస్తున్నారు.

ఈ ప్రమాదంతో అపార్ట్మెంట్ బాల్కనీ, గ్రిల్స్ ధ్వంసమయ్యాయి. పేలుడు ధాటికి రాయి తగిలి అపార్ట్మెంట్ బయట ఉన్న గొట్టుముక్కల శ్రీనివాసరావు అనే వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. ఆయన్ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈనెల 7న సత్యానంద్ తన కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్లారు. పేలుడు సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది.

Posted Under AP
Editor