అంతర్రాష్ట్ర భారీ దారిదోపిడీ ముఠా గుట్టురట్టు: ₹1.26 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్న శ్రీ సత్యసాయి జిల్లా పోలీసులు

అంతర్రాష్ట్ర దొంగల ముఠా పట్టివేత శ్రీ సత్య సాయి జిల్లా భారీ నగదును తీసుకు వెళుతున్న వ్యాపారస్తులను లక్ష్యంగా చేసుకొని దారిదోపిడీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను శ్రీ సత్యసాయి జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. వారి నుండి కోటి 26 లక్షలు నగదు, మూడు కార్లు, 13 సెల్ ఫోన్లు, మూడు కత్తులుస్వాధీనం చేసుకున్నారు. అంతరాష్ట్ర దొంగల ముఠాను అరెస్టు చేసిన సందర్భంగా బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ సతీష్ కుమార్ అదనపు ఎస్పీ అంకితా సురానా తో కలిసి పాత్రికేయాల సమావేశం నిర్వహిం చి కేసు వివరాలను వెల్లడించారు. కేరళకు చెందిన సిరిల్ మ్యాథ్యూ 20 మంది సభ్యులతో కలిసి ముఠాను ఏర్పాటు చేసి భారీగా నగదును తీసుకు వెళుతున్న వ్యాపారస్తులను జాతీయ రహదారులపై అడ్డగించి వారిని అపహరించి వారి వద్దనున్న నగదును దోచుకుని నిర్జన ప్రదేశాలలో వారిని వదిలిపెట్టేవారు. ఇలా గత సంవత్సరం డిసెంబర్ మూడున కియా పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యాపారస్తులను అడ్డగించి వారి వద్ద నుండి రెండు కోట్ల ఎనిమిది లక్షలు అపహరించి వారిని నిర్జన ప్రదేశంలో వదిలిపెట్టి వెళ్లారు. అలాగే ఈ సంవత్సరం ఫిబ్రవరి 21న మామిళ్ళపల్లి వద్ద మూడు కోట్లు నగదుతో వెళుతున్న వాహనాన్ని అడ్డగించి బాధితులను అపహరించే వారి వద్ద నుండి మూడు కోట్ల వ్యాపారించారు ఇలా రెండు కేసులలో దొంగలు ఐదు కోట్ల 8 లక్షల అపహరించారు. కేసులను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ దర్యాప్తు కోసం పది బృందాలను నియమించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రధాన నిందితుడు సిరిల్ మాత్యు నేపాల్ నుండి కారకలాపాల కొనసాగిస్తున్నాడని తెలుసుకున్న పోలీసులు మార్చి 15న ప్రధాన నిందితుడితో పాటు మరో ఇద్దరు అరెస్టు చేశారు ఈనెల 5న మరో ఏడుగురు అరెస్ట్ చేసి వారి వద్ద నుండి కోటి 26 లక్షలు నగదు మూడు కార్లు 13 సెల్ఫోన్లు కత్తులు దోపిడీకి ఉపయోగించిన పెప్పర్ స్ప్రే మాస్కులు ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరో 11 మందిని త్వరలో అరెస్టు చేస్తామని ఎస్పీ తెలిపారు. కేసులు చేదించిన పది పోలీసు బృందాలను ఈ సందర్భంగా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు

Posted Under AP
Editor