బుక్కరాయసముద్రం మండలం ఎమ్మార్వో ఆఫీస్ దగ్గర శ్రీ సత్య సాయి సాగునీటి సరఫరా కార్మిక సంఘం జేఏసీ ఆధ్వర్యంలో రెండవ రోజు నిరవధిక సమ్మె చేపట్టిన
కార్మికులు
అధికారులు ప్రజాప్రతినిధులు సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి రెండు నెలలు కావస్తున్న పట్టించుకోలేదని కార్మికుల ఆగ్రహం
ఈ సందర్భంగా సత్యసాయి కార్మికులు మాట్లాడుతూ
సత్యసాయి కార్మికులను బోర్డు జాబితాలో శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని అదేవిధంగా ఐదు నెలల బకాయి వేతనాలను వెంటనే విడుదల చేయాలని
అదేవిధంగా సత్యసాయి కార్మికుల బోర్డును ఆర్డబ్ల్యూఎస్ లో విలీనం చేయకుండా గుర్తించాలి
అదేవిధంగా సత్యసాయి కార్మికులకు ప్రత్యేక నిధులు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు
సంక్షేమ పథకాల పేరిట కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం ప్రజల దాహార్తిని తీర్చే తాగునీటి పథకం గురించి పట్టించుకోవడంలేదని మండిపాటు
తమ సమస్యలు పరిష్కరించే
వరకు నిరవధిక సమ్మె కొనసాగుతుందని వారు తెలిపారు
బుక్కరాయసముద్రంలో రెండో రోజూ కొనసాగిన సత్యసాయి నీటి సరఫరా కార్మికుల నిరవధిక సమ్మె
