ముదిగుబ్బ యస్ 9
ఈరోజు ముదిగుబ్బలో ఆర్డిటి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకున్న అనంతలక్ష్మి మహిళా సహాయక సహకార పొదుపు మరియు పరపతి సంఘం లిమిటెడ్ ను ఆర్డిటి సంస్థ ప్రతినిధులైన మహిళా విభాగపు ఉమెన్ సెక్టర్ డైరెక్టర్ శ్రీమతి విశాల ఫెర్రర్ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది అనంతరం కళ్యాణ వెంకటేశ్వర మండపంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ఇంతవరకు సత్య సాయి అనంతపురం ఉమ్మడి జిల్లాలో మొత్తం ముదిగుబ్బ బ్యాంకుతో కలిపి 27 బ్యాంకులను ప్రారంభించినట్లు సుమారు 60 కోట్లు పెట్టుబడి తో మహిళా బ్యాంకులు బాగా లాభాలు గడిస్తూ ముందుకు వెళుతున్నట్లు తెలియపరిచారు మహిళలు ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెంది సమాజంలో కుటుంబంలో సమానత్వాన్ని సాధించి విలువ గౌరవాన్ని పెంపొందించుకోవాలని మహిళలు కుటుంబ అభివృద్ధిలో ఎంతో కీలకమని తెలియజేశారు ముదిగుబ్బ మహిళా బ్యాంకును సుమారు 70 లక్షల వాటాదనముతో బ్యాంకును ప్రారంభించుకున్నందుకు సంఘ సభ్యులందరికీ అభినందనలు తెలియజేశారు ప్రతి మహిళ ఆర్థికంగా అభివృద్ధి చెందాలని తీసుకున్న రుణాలను సకాలంలో తిరిగి చెల్లించి ప్రతి ఒక్కరు అనంతలక్ష్మి మహిళా కోఆపరేటివ్ బ్యాంకు అభివృద్ధి దోహదపడాలని తెలియజేశారుఈ కార్యక్రమంలో రీజినల్ డైరెక్టర్ హనుమంతప్ప ఏ. టి. యల్.కృష్ణ అకౌంటెంట్ వెంకటేష్, కౌన్సిలర్ పర్వీన్ సి ఓ లు రామణప్ప,కీర్తి, శ్రీరాములు మరియు వివిధ గ్రామాల నుండి 1000 మంది మహిళలు పాల్గొనడం జరిగింది సమావేశం అనంతరం సాంస్కృతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించడం జరిగింది.
ముదిగుబ్బలో ‘అనంతలక్ష్మి మహిళా బ్యాంకు’ ప్రారంభం: మహిళలు ఆర్థికంగా ఎదగాలని విశాల ఫెర్రర్ పిలుపు!
