అనంతపురం జిల్లా తాడపత్రి
కడప రోడ్డు ఐశ్వర్య విలాస్ ఎదురుగా టీ బార్ లో రైతు వైఫ్ ప్రభాకర్ రెడ్డి సజ్జలదిన్నె విఆర్ఓ కు 30 వేల రూపాయలు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
తాడిపత్రి మండలం సజ్జలదిన్నె గ్రామానికి చెందిన వీఆర్వో రామకృష్ణ అవినీతి నిరోధక శాఖ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఆవుల తిప్పాయపల్లె గ్రామానికి చెందిన రైతు మీడియాతో మాట్లాడుతూ
వారసత్వంగా వచ్చిన భూమిని వెబ్ ల్యాండ్‌లో మిగులు భూమిగా చూపించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రామకృష్ణ… ఆ భూమిని తిరిగి తన పేరుపై నమోదు చేసి పట్టాదారు పాస్ పుస్తకం ఇవ్వాలంటూ రైతు ప్రతాపరెడ్డి నుంచి లక్ష రూపాయలు డిమాండ్ చేయగా 30 వేల రూపాయల విఆర్ఓ రామకృష్ణకు ఇచ్చినట్లుగా తెలిపారు.
దీనిపై బాధిత రైతు ప్రతాపరెడ్డి ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయగా… వారి సూచనల మేరకు లంచం ఇస్తున్న సమయంలో అధికారులు వీఆర్వోను పట్టుకున్నారు.
ఏసీబీ డీఎస్పీ ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆపరేషన్‌లో రామకృష్ణను అదుపులోకి తీసుకుని… తాడిపత్రి తహసీల్దార్ కార్యాలయంలో విచారణ కొనసాగిస్తున్నారు.
