శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ మండలం రాగానిపల్లి వద్ద నిర్మించిన స్వశక్తి సేంద్రియ అటవీ ఉత్పత్తి దారుల పరస్పర సహాయక సహకార సంఘం ఎఫ్.పి.ఓ కు సంబంధించిన గోదాము నిర్మాణంలో అవకతవకలు జరిగినట్టు రాగానిపల్లి కు చెందిన రవీంద్ర. మనోహర. ఆనంద్. లు రేట్స్ సంస్థ భానుజా పై అసత్య ఆరోపణలు చేశారు. దీనికి సంబంధించి రెడ్స్ సమస్త అధ్యక్షురాలు భానుజా వివరణ ఇస్తూ
మూడేళ్ల క్రితం 15 లక్షల వ్యయంతో గోదాము నిర్మాణం చేపట్టామని, 11,లక్షల 25 వేలు సబ్సిడి ఉంటుందని తెలిపాము దీంతో రాగానిపల్లి గ్రామానికి చెందిన మనోహర్ రవీంద్ర ఆనందులు తమ పొలంలో గోదాము నిర్మాణం చేద్దామని మేమే నిర్మిస్తామని వారు తెలపగా వారికి 12 లక్షల 46000 చెల్లించామన్నారు. మిగిలిన మొత్తం గోదాముకి విద్యుత్ సౌకర్యం నీటి సౌకర్యం కల్పించాక మిగిలిన బకాయిలు ఇస్తామని ఎఫ్ఈఓ తీర్మానం ద్వారా తెలిపాము. అయితే రెండు సంవత్సరాల నుంచి ఏమీ మాట్లాడని ఆ వ్యక్తులు మాకు భానుజా మోసం చేసిందని గ్రీవెన్స్ లో భానుజా మీద కలెక్టర్ గారికి ఫిర్యాదు చేశారు అలాగే కొన్ని ప్రసార మాధ్యమాల ద్వారా భానుజా గారిపై అసత్య ఆరోపణలు చేశారు. అయితే మూడు సంవత్సరాలు గడిచిన గోదాముకి విద్యుత్ సౌకర్యం గాని నీటి సౌకర్యం గాని కల్పించలేదన్నారు. విద్యుత్ సౌకర్యం నీటి సౌకర్యం కల్పిస్తే మిగిలిన మొత్తాన్ని ఆ వ్యక్తులకు అందజేస్తామని ఎఫ్ఈఓ సభ్యులు తెలిపారు. సంఘ సభ్యుడు కృష్ణయ్య మాట్లాడుతూ ఇది ఉత్పత్తిదారుల సంఘానికి సంబంధించిన విషయం సంఘ సభ్యులను అడగకుండా ఇలా సోషల్ మీడియాలో పెట్టడం మంచిది కాదు అన్నారు ఈ విషయంలో రైట్స్ సంస్థ భానుజాకి ఎటువంటి సంబంధం లేదు అని తెలిపారు ఈ కార్యక్రమంలో రెడ్స్ సంస్థకు సంబంధించిన భానుజా ఎఫ్ఈఓ సంస్థకు సంబంధించిన వారు రైతులు పత్రిక విలేకరులు పాల్గొన్నారు
