Latest Posts

ఉరవకొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు: పటిష్ట భద్రతా ఏర్పాట్లపై పోలీసు అధికారుల సమీక్ష

ఉరవకొండ…
శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దివ్య కృపా కటాక్షాలతో వైభవంగా జరగబోయే వార్షిక బ్రహ్మోత్సవాలు సమీపిస్తున్న ఈ శుభసందర్భంలో భక్తజనుల భద్రత మరియు సౌకర్యాలను అత్యున్నత ప్రాధాన్యతగా భావిస్తూ ఈ రోజున ఉరవకొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ గౌరవనీయులు శ్రీ మహానంది గారు మరియు సబ్ ఇన్స్పెక్టర్ శ్రీ జనార్దన్ నాయుడు గారు తమ పోలీసు సిబ్బందితో సహా దేవస్థానాన్ని ప్రత్యక్షంగా దర్శించి సమగ్రంగా పరిశీలించడం జరిగింది . ఈ సందర్భంగా దేవస్థానం ఆవరణము అంతట భద్రత ఏర్పాట్లపై సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించబడింది భక్తుల రాకపోకలను సునీచ్చితంగా సాఫీగా నిర్వహించుటకు క్యూలైన్ల పటిష్టతను పరిశీలించి అవసరమైన మార్గదర్శకాలు అందజేయడం జరిగింది అలాగే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ సీసీ కెమెరాలు సమగ్ర అమరికపై ప్రత్యేక దృష్టి సారించబడింది బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా శాంతి భద్రతలను కట్టుదిట్టంగా నిర్వహించుటకు పోలీసు శాఖ తరపున సమగ్ర బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు
సాకేరమేష్ బాబు
కార్యనిర్వాహనాధికారి

Posted Under AP
Editor