అనంతపురం జిల్లా.
రాష్ట్రంలో గూగుల్ డేటా సెంటర్ ప్రారంభించడం ఒక చారిత్రాత్మక ఘట్టం..*
– *: రాష్ట్రానికి గూగుల్ డేటా సెంటర్ సంస్థను తీసుకురావడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఎంతగానో కృషి చేశారు.. ఇందుకు సీఎంకి, మంత్రికి అభినందనలు..*
– *: తాగునీటి మరియు విద్యుత్ సమస్యలను త్వరితగతిన పరిష్కరించడానికి ఆర్.డబ్ల్యు.ఎస్ విద్యుత్, మరియు పంచాయతీ రాజ్ మూడు శాఖలతో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు..*
– *: గ్రామస్థాయిలో ఇంజనీరింగ్ అసిస్టెంట్లను బాధ్యులను చేస్తూ ‘ఫస్ట్ రెస్పాన్స్’ వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నాం..*
– *వేసవిలో త్రాగు నీటి ఎద్దడి లేకుండా పక్కా ప్రణాళికలు అమలుకు చర్యలు*
– *: ప్రెస్ మీట్ లో రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్..*
– *అనంతపురం నగరంలోని ఆర్.అండ్.బి అతిథి గృహంలో మంగళవారం రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ ప్రెస్ మీట్ నిర్వహించారు.*
– *ఈ సందర్భంగా మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో గూగుల్ డేటా సెంటర్ ప్రారంభించడం ఒక చారిత్రాత్మక ఘట్టమని, దీనివల్ల భవిష్యత్ తరాలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. రాష్ట్రానికి గూగుల్ డేటా సెంటర్ సంస్థను తీసుకురావడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యా శాఖ మంత్రి లోకేష్ చేసిన కృషిని మంత్రి అభినందించారు. ఉమ్మడి రాష్ట్రంలో హైటెక్ సిటీ నిర్మించడం ద్వారా ఐటీ రంగంలో తెలుగు జాతికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించిందని, ఇప్పుడు క్వాంటం టెక్నాలజీ మరియు డేటా సెంటర్ల ద్వారా అదే విధమైన మార్పు రాబోతుందన్నారు. రాష్ట్రంలో క్వాంటం టెక్నాలజీ మరియు డేటా సెంటర్ల ఏర్పాటుతో రాబోయే 20 ఏళ్లలో ఎక్కడ ఉద్యోగ అవకాశాలకు ప్లాట్‌ఫారంగా మారుతుందన్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా 20 లక్షల ఉద్యోగాల కల్పన దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో అమరరాజా వంటి పరిశ్రమలు రాష్ట్రం వదిలి వెళ్ళిపోయాయని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్రెడిట్ కోసం కాకుండా అభివృద్ధి కోసం పనిచేస్తున్నారన్నారు. తమ ప్రభుత్వంలో వస్తున్న ప్రాజెక్టుల ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనని, ఎకో సిస్టం క్రియేట్ చేస్తామన్నారు. అన్ని విషయాల్లోనూ తమ లక్ష్యాన్ని సాధించి తీరుతామన్నారు.*
– *వేసవి చాలా తీవ్రంగా ఉందని, వేసవిలో త్రాగునీటి సరఫరాపై అధికారులతో సమీక్ష నిర్వహించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో శ్రీరామరెడ్డి తాగునీటి పథకం, శ్రీ సత్యసాయి వాటర్ బోర్డు స్కీమ్, సిపిడబ్ల్యూ స్కీమ్స్, గ్రామస్థాయిలో పథకాల గురించి అనలైజ్ చేసామన్నారు. జిల్లాలో శ్రీ సత్యసాయి తాగునీటి పథకానికి సంబంధించి విద్యుత్ శాఖకు దాదాపు రూ. 310 కోట్ల బకాయిలు ఉన్నాయని, అలాగే ఉద్యోగుల జీతాల కోసం మరో రూ. 30 కోట్ల బకాయిలు ఉన్నాయన్నారు. పిఏబిఆర్ వద్ద పంపింగ్ కేంద్రాలలో మోటార్ల నిర్వహణ అధ్వాన్నంగా ఉందని, స్టాండ్‌బై మోటార్లు కూడా అందుబాటులో లేకపోవడం వల్ల నీటి సరఫరాకు తీవ్ర అంతరాయం కలుగుతోందని, పీఏబీఆర్ డ్యామ్ వద్ద మోటార్ల మరమ్మతుల కోసం తక్షణమే రూ. 3.5 కోట్లు మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు. తాగునీటి మరియు విద్యుత్ సమస్యలను త్వరితగతిన పరిష్కరించడానికి మూడు శాఖలతో (తాగునీటి, విద్యుత్, మరియు పంచాయతీ రాజ్) కలిపి ఒక ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గ్రామ స్థాయిలో పైపులు పగిలినా లేదా విద్యుత్ సమస్యలు తలెత్తినా గంట వ్యవధిలోనే కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించేలా ఇంజనీరింగ్ అసిస్టెంట్లను బాధ్యులను చేస్తూ ‘ఫస్ట్ రెస్పాన్స్’ వ్యవస్థను తీసుకువచ్చామన్నారు. వేసవి దృష్ట్యా తాగునీటి ఎద్దడి లేకుండా చూడాలని, పంపింగ్ సమయాన్ని పెంచాలని అధికారులను ఆదేశించామన్నారు. ఎక్కడైనా 18 గంటల పంపింగ్ ఉంటే దానిని 20 గంటలకు, 20 గంటలు ఉన్న చోట 22 గంటలకు పెంచాలని సూచించామన్నారు.*
– *సత్యసాయి మరియు శ్రీరామిరెడ్డి తాగునీటి పథకాల్లో ఎలక్ట్రికల్ మరియు పైపులైన్ల మరమ్మతుల కోసం ప్రత్యేక టీంలను ఏర్పాటు చేయాలని, స్టాండ్‌బై మోటార్లను సిద్ధంగా ఉంచుకోవాలని చెప్పారు. ఎల్ నినో ప్రభావంతో ఎండలు పెరిగే అవకాశం ఉన్నందున, జూన్ వరకు అవసరమైన యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశామని తెలిపారు. కంట్రోల్ రూమ్ నంబర్లను ప్రజలకు అందుబాటులో ఉంచాలని కోరారు. గత ప్రభుత్వ కాలం నుండి పేరుకుపోయిన సుమారు రూ. 300 – 400 కోట్ల బకాయిల వల్ల వ్యవస్థ బలహీనపడిందని, ముఖ్యంగా కార్మికుల జీతాలు మరియు కనీస నిర్వహణ ఖర్చుల కోసం సుమారు రూ. 40 కోట్లు విడుదల చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. పంచాయతీ రాజ్, సచివాలయ వ్యవస్థ మరియు విద్యుత్ శాఖ అధికారులు సమన్వయంతో పని చేయాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. భూగర్భ జలాలు తగ్గిపోతున్న తరుణంలో, రిజర్వాయర్లలో నీటి నిల్వలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని మరియు భవిష్యత్తు అవసరాల కోసం ‘సబ్ సర్ఫేస్ చెక్ డ్యామ్’ల నిర్మాణాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు*
