తాడిమర్రి(yes9tv)షార్ట్ సర్క్యూట్‌తో రైతుకు భారీ నష్టం – పూర్తి పరిహారం కోసం వేచిచూస్తున్న దామోదర్ రెడ్డి
వివరాలు:
తాడిమర్రి మండలంలోని పుల్లా నారాయణపల్లి గ్రామానికి చెందిన రైతు పుల్ల దామోదర్ రెడ్డి తీవ్ర నష్టాన్ని చవిచూశారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఆయనకు చెందిన రెండున్నర ఎకరాల వ్యవసాయ భూమిలో అమర్చిన ఫిల్టర్ డ్రిప్ పైపులు దెబ్బతిన్నాయి. సుమారు రూ.50 వేల విలువైన డ్రిప్ పైపులు పూర్తిగా నాశనమయ్యాయి.
407/1 సర్వే నంబర్‌లో ఉన్న ఈ వ్యవసాయ భూమిపై మొత్తం రూ.3 లక్షల పెట్టుబడి పెట్టినట్లు రైతు తెలిపారు. అయితే పంటకు సరైన ధర లేకపోవడంతో ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో ఈ ఘటన మరింత భారంగా మారింది.
ప్రభుత్వం ద్వారా అందాల్సిన పరిహారం విషయంలో కూడా రైతుకు ఇప్పటివరకు మొదటి విడతగా కేవలం రూ.1,20,000 మాత్రమే అందినట్లు తెలిసింది. మిగిలిన పరిహారం త్వరితగతిన మంజూరు చేయాలని రైతు మరియు గ్రామస్థులు అధికారులను కోరుతున్నారు.
షార్ట్ సర్క్యూట్‌తో రైతుకు భారీ నష్టం – పూర్తి పరిహారం కోసం వేచిచూస్తున్న దామోదర్ రెడ్డి
