ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్, డీజిల్ కొరతపై సీపీఎం-సీఐటీయూ ఆందన…

ముదిగుబ్బ యస్ 9
గత రెండు రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రంగా నెలకొనడంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సీపీఎం, సీఐటీయూ, ఆవాస్ కమిటీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా తగిన చర్యలు తీసుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని విమర్శించారు.ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రజలకు ఇంధన సరఫరా అంతరాయం లేకుండా చూడాలని కోరారు. పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూలు కనిపిస్తున్నాయని, సాధారణ ప్రజలు పనుల కోసం వెళ్లడానికే ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
అదేవిధంగా రైతులు కూడా తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం టమోటా, మిరప, మామిడికాయల సీజన్ కొనసాగుతున్నందున రైతులు తమ పంటలను మార్కెట్‌కు తరలించేందుకు డీజిల్ కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వాహనాలకు డీజిల్ అందకపోవడంతో వ్యవసాయ ఉత్పత్తుల రవాణా దెబ్బతింటోందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఇంధన కొరత సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని సీఐటీయూ ముదిగుబ్బ మండల కార్యదర్శి బాబ్జాన్ డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు ముదిగుబ్బ మండల కార్యదర్శి బాబ్జాన్ కోకన్వీనర్ టైలర్ ముస్తఫా రఫీ పకీరప్ప అల్లా బకాష్ తదితరులు పాల్గొన్నారు…

Posted Under AP
Editor