ముదిగుబ్బ, యస్ 9
ముదిగుబ్బలో మంత్రి సత్యకుమార్ పర్యటన…
ముదిగుబ్బ మండలంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ పర్యటన ,ముదిగుబ్బ, ఏప్రిల్ 18:– రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్య శాఖామాత్యులు, ధర్మవరం శాసనసభ్యులు సత్యకుమార్ యాదవ్, ఆదివారం ముదిగుబ్బ మండలంలో పర్యటించనున్నట్లు మంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ పర్యటనలో భాగంగా ప్రజల భాగస్వామ్యంతో నిర్వహించే అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పాల్గొననున్నట్లు వివరించింది. ఆదివారం ఉదయం 8:00 గంటలకు ముదిగుబ్బ మండలం, బుదనంపల్లి గ్రామంలోని చింతకుంట చెరువు వద్ద ఏర్పాటు చేసిన వీబీజీ–రామ్‌జీ (VBG – RamG) కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొననున్నారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ మరియు స్థానిక వనరుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు మంత్రి కార్యాలయం తెలిపింది…
నేడు ముదిగుబ్బలో మంత్రి సత్యకుమార్ పర్యటన: బుదనంపల్లిలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి.
