మహిళా ద్రోహులు ఎవరో తేలిపోయింది: విపక్షాల తీరుపై సోమల ప్రకాష్ నాయుడు ఫైర్!

విపక్షాల అసలు స్వరూపం బయటపడింది – మహిళా ద్రోహులు ఎవరో తేలిపోయింది!
బీజేపీ కిసాన్ మోర్చా శ్రీ సత్య సాయి జిల్లా అధ్యక్షుడు సోమల ప్రకాష్ నాయుడు మాట్లాడుతూ ​నారీ శక్తికి పెద్దపీట వేస్తూ, దేశాభివృద్ధిలో మహిళలను భాగస్వాములను చేయాలన్న గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి దృఢ సంకల్పానికి విపక్షాలు మరోసారి అడ్డుపడ్డాయి. లోక్‌సభలో ‘మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లు’ను వ్యతిరేకించడం ద్వారా తమ మహిళా వ్యతిరేక వైఖరిని ప్రతిపక్షాలు మరోసారి బహిర్గతం చేసుకున్నాయి.బయట మహిళా సాధికారత గురించి గొప్పలు చెప్పే పార్టీలు, పార్లమెంట్‌ సాక్షిగా మహిళా హక్కులను కాలరాయడం వారి ద్వంద్వ నీతికి నిదర్శనం. కోట్లాది మంది భారతీయ మహిళల కలలను చిదిమేస్తూ, కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ఈ చారిత్రక బిల్లును వ్యతిరేకించడం క్షమించరాని నేరం.
మహిళా సాధికారత దిశగా సాగుతున్న ఈ మహా యజ్ఞాన్ని ఎన్ని శక్తులు అడ్డుకున్నా, ప్రధాని మోదీ గారి నాయకత్వంలో మహిళలకు వారి హక్కులు దక్కే వరకు మా పోరాటం ఆగదు.ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా శ్రీ సత్య జిల్లా లో కూడా మహిళా మోర్చా మరియు యువ మోర్చా ఆధ్వర్యం లో రాహుల్ గాంధీ దిష్టి బొమ్మ దగ్ధం చేసి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమము నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో బిజెపి కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు పసుపులేటి వెంకటేష్ సోషల్ మీడియా కన్వీనర్ పీవీ శివకుమార్ కిసాన్మోర్చా జిల్లా ఎగ్జిక్యూటివ్ నెంబర్ దేశ నారాయణ నాయకులు పాల్గొన్నారు…

Posted Under AP
Editor