అనంతపురం జిల్లా, కలెక్టరేట్.
*జర్నలిస్టులు ఆరోగ్యం పై శ్రద్ధ చూపండి*
*మరణించిన జర్నలిస్టులు కాలువ రమణ ఆంధ్రజ్యోతి రవికుమార్ కుటుంబాలకు సహాయం చేస్తాం*
*వర్కింగ్ జర్నలిస్టులకు కంటి అద్దాలు పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ రవికాంత్ రమణ మచ్చా రామలింగారెడ్డి*
*అనంత జిల్లా కలెక్టర్
ఓ .ఆనంద్ *
వర్కింగ్ జర్నలిస్టులు నిత్యం పని ఒత్తిడితో ఉండడం వల్ల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం చాలా ప్రమాదకరమని జర్నలిస్టులు ఆరోగ్యంగా ఉంటేనే సమాజానికి మేలు జరుగుతుందని వర్కింగ్ జర్నలిస్టులు అందరూ ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ చూపాలని అనంతపురం జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ సూచించారు
ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఏపీ జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో అనంతపురం నగరంలోని కలెక్టర్ కాన్ఫరెన్స్ కార్యాలయం నందు జిల్లా వర్కింగ్ జర్నలిస్టులకు ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి మచ్చా రామలింగారెడ్డి రాష్ట్ర అధ్యక్షులు అధ్యక్షత వహించారు కార్యక్రమంలో మీనాక్షమ్మ ఫౌండేషన్ చైర్మన్ రవికాంత్ రమణ డాక్టర్ మదన్ మోహన్ రెడ్డి సమాచార శాఖ ఏడి బాలకొండయ్య సీనియర్ జర్నలిస్టులు ఆజాద్ మారుతి
షేక్ బికారి కుళాయి స్వామి వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మచ్చా రామలింగారెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టులకు అన్ని విధాలుగా అండగా ఉండాలన్న ఉద్దేశంతో ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపిస్తున్నామని అందుకే కార్యక్రమాలు నిర్వహించామని వర్కింగ్ జర్నలిస్టులతో పాటు వారి కుటుంబ సభ్యులను కూడా ఐ క్లినిక్ కంటి పరీక్షలు200 మందికి పైగా నిర్వహించడం జరిగిందని అన్నారు ఇటీవల మరణించిన ఆంధ్రజ్యోతి రవికుమార్ సీనియర్ జర్నలిస్ట్ కాలువ రమణ కుటుంబాలను జిల్లా కలెక్టర్ ఆదుకోవాలని వారి కుటుంబాలకు ఉద్యోగము ఇంటి పట్టా ఇల్లు ఆర్థిక సహకారం అందించాలని మచ్చా రామలింగారెడ్డి జిల్లా కలెక్టర్ ను కోరారు
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ మాట్లాడుతూ జర్నలిస్టు కుటుంబాలు ఆంధ్ర జ్యోతి రవికుమార్ కాలువ రమణ కుటుంబాలకు జిల్లా యంత్రాంగం తరఫున కావాల్సిన సహకారం ఇవ్వడం జరుగుతుందని పరిశీలించి వారి కుటుంబాలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు జర్నలిస్టులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని జర్నలిస్టుల న్యాయమైన సమస్యలు ఎప్పుడూ జిల్లా యంత్రాంగం పరిష్కరించేందుకు సిద్ధంగా ఉంటుందని జర్నలిస్టులు జిల్లా అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కలెక్టర్ ఓ ఆనంద్ సూచించారు ఇటువంటి కార్యక్రమం జర్నలిస్టులకు నిర్వహించడం వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షులు మచ్చా రామలింగారెడ్డి కృషి అభినందనీయమని అని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ అన్నారు
రవికాంత్ రమణ మాట్లాడుతూ జర్నలిస్టులకు తమ సంస్థ ద్వారా ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించామని వచ్చే వారం పరీక్షలు ఆపరేషన్లు కూడా ఉచితంగా చేయడం జరుగుతుందని ఈ అవకాశాన్ని జర్నలిస్టులందరూ ఉపయోగించుకున్నందుకు ధన్యవాదాలు తెలుపుతున్నానని రవికాంత్ రమణ అన్నారు సమావేశం అనంతరం జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ ను రవికాంత్ రమణాను జిల్లా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఘనంగా సన్మానించి మెమొంటోలు అందజేశారు జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ చేతులమీదుగా జర్నలిస్టు కుటుంబాలకు ఉచితంగా కంటి అద్దాలను పంపిణీ చేయడం జరిగింది అనంతరం జిల్లా కలెక్టర్ జర్నలిస్టులను అభినందించారు ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ ఆజాద్ ఫోటోగ్రాఫర్ మారుతి మల్లికార్జున రాము బాలు వేణుగోపాల్ శ్రీనివాస్ రెడ్డి సాయి మురళి ప్రకాష్ కృష్ణబాబు శ్రీనివాసులు పెద్ద ఎత్తున జర్నలిస్టులు వారి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
*ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఏపీ జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ*
