Latest Posts

పిన్నదరిలో భక్తిశ్రద్ధలతో వనభోజ మహోత్సవం: ఆధ్యాత్మిక ప్రవచనాలతో పులకించిన గ్రామం

తాడిమర్రి(yes9tvపిన్నదరిలో అంగరంగ వైభవంగా వనభోజ మహోత్సవం
తాడిమరి మండలంలోని పిన్నదరి గ్రామంలో బుధవారం వనభోజ మహోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. బుధవారం ఉదయం 7 గంటలకు గ్రామస్థులంతా గ్రామాన్ని ఖాళీ చేసి, శ్రీ రామస్వామి మరియు అతకల్లప్ప స్వామి విగ్రహాలను ఊరి బయటకు ఘనంగా తీసుకువెళ్లారు.
అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి, శ్రీ వెంకటేశ్వర శర్మ స్వామి ఆధ్వర్యంలో రామాయణ పురాణాలపై ఆధ్యాత్మిక ప్రవచనాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు.
తదనంతరం గ్రామస్తులందరూ తమ కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి సరదాగా, ఆనందంగా వనభోజ మహోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ కార్యక్రమం మొత్తం గ్రామ పెద్దల ఆధ్వర్యంలో విజయవంతంగా జరిగింది.

Posted Under AP
Editor