Latest Posts

అనంతపురం రెడ్డి కళ్యాణమండప నిర్మాణానికి SRM బిల్డర్స్ శివారెడ్డి భారీ విరాళం: రూ. 20 లక్షలతో కాంపౌండ్ వాల్ నిర్మాణం

రెడ్డి సంక్షేమంపై SRM బిల్డర్స్ శివారెడ్డి ఉదారత
— రెడ్డి కళ్యాణమండప కాంపౌండ్ వాల్ నిర్మాణ ఖర్చు రూ.20 లక్షలకు ఓకే
— రెడ్డి సంఘం ప్రతినిధుల ప్రశంసలు

అనంతపురం

అనంతపురం నగరంలో మెజార్టీ కులాలకు కళ్యాణ మండపాలు ఉన్నాయి… అయితే రెడ్డి కళ్యాణమండపం లేకపోవడం పెద్ద లోటుగా కనిపిస్తూ వస్తోంది… కొంతమంది రెడ్డి ప్రతినిధులు దాదాపు 20 ఏళ్లుగా రెడ్డి సంక్షేమం కొరకు కళ్యాణ మండపం నిర్మించాలని ప్రయత్నాలు చేసినా అవి సఫలీకృతం కాలేదు….

రెడ్డి కళ్యాణమండపం నిర్మించాలని నగరంలోని రెడ్డి ప్రముఖులు సంకల్పించారు… వెంటనే రంగంలోకి దిగిన వారు జిల్లావ్యాప్తంగా నిర్మాణ రంగంలో పేరొందిన ఎస్ఆర్ఎం బిల్డర్స్ అధినేత… యువకుడు.. బెడుదూరి శివారెడ్డిని సంప్రదించారు… రెడ్డి సంక్షేమం కోసం మంచి కార్యక్రమాన్ని సంకల్పించారని వారికి శివారెడ్డి కితాబు ఇచ్చారు… అలాగే తన వంతుగా ఆయన మరోసారి ఉదారతను చాటుకున్నారు… రెండు ఎకరాల్లో నిర్మిస్తున్న కళ్యాణ మండపానికి 20 లక్షల వ్యయం అయ్యే కాంపౌండ్ వాల్ ను తానే సొంత ఖర్చుతో నిర్మాణానికి అంగీకరించినట్లు రెడ్డి ప్రతినిధులు తెలిపారు…. ఈ సందర్భంగా వారు శివారెడ్డిని శాలువా కప్పి సన్మానించారు…

Posted Under AP
Editor