తాడిమర్రిలో అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ – చందమామ గంగాధర్ ఆధ్వర్యంలో విజయవంతం, యువత భారీగా పాల్గొని జైభీమ్ నినాదాలు
తాడిమర్రి మండల కేంద్రంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడినాయి. ఈ వేడుకలకు పెద్ద ఎత్తున యువత పాల్గొని ఉత్సాహభరిత వాతావరణాన్ని సృష్టించారు.
కార్యక్రమం సందర్భంగా యువత బైక్ ర్యాలీ నిర్వహించి, పటాకులు పేలుస్తూ ఆనందోత్సాహాలను పంచుకున్నారు. మండల కేంద్రం మొత్తం “జై భీమ్” నినాదాలతో మార్మోగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మార్పీఎస్ నాయకుడు పెద్ద ఓబులేసు మరియు ఎస్సీ జన సంఘం జాతీయ అధ్యక్షుడు దాసగానపల్లి కుల్లాయప్ప హాజరయ్యారు. వారు మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారు మాదిగల అభివృద్ధి కోసం చేసిన కృషి, రిజర్వేషన్ల ప్రాముఖ్యత, రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులు మరియు సామాజిక న్యాయం అంశాలపై యువతకు అవగాహన కల్పించారు. అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజర్ చందమామ గంగాధర్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. ఆయన ప్రత్యేకంగా అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసి, పాల్గొన్న ప్రతి ఒక్కరికీ భోజన వసతి కల్పించారు. కార్యక్రమం విజయవంతం కావడానికి ఆయన చేసిన కృషిని నాయకులు అభినందించారు.
అనంతరం అంబేద్కర్ గారి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి, మండల కేంద్రంలోని విగ్రహానికి పూలమాలలు సమర్పించి ఘన నివాళులు అర్పించారు. కార్యక్రమంలో భాగంగా కేక్ కటింగ్ కూడా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ నాయకుడు పెద్ద ఓబులేసు మాట్లాడుతూ కార్యక్రమంలో పాల్గొన్న యువతకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. యువతలో సామాజిక చైతన్యం పెరగడం సంతోషకరమని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు చందమామ గంగాధర్, బండారు నాగభూషణ నాయకులు ఫకీర్ గాళ్ళ గణేష్, పొన్నూరు ఆనంద్, బండారు నరేంద్ర, పొన్నూరు గణేష్, బండారు పెద్దిరాజు, చందమామ ముని ప్రసాద్, బి సాని విజయకుమార్, సాకే విజయభాస్కర్, సాకే జగదీష్, సాకే శ్రీరామ్ మూర్తి, సాకే లోకేష్, బి సాని నరేష్ బాబు, గంగాధర్, బండారు రానా, సాకే అరవింద్ కుమార్, డీకే రమేష్ బాబు, సాకే ప్రేమ్, దేవకుమార్, బికే నాని, బికే పవన్, బికే నరసింహులు, బన్నీ, బండారు మనోహర్, బండారు రామాంజనేయులు, సాకే వెంకటేశులు, పొప్పూరు సాయికిరణ్, పి రాము, బండారు నాగభూషణ తదితరులు పాల్గొన్నారు.
తాడిమర్రిలో హోరెత్తిన అంబేద్కర్ జయంతి వేడుకలు: చందమామ గంగాధర్ ఆధ్వర్యంలో ఘన నివాళి
