Latest Posts

దళితుల అభ్యున్నతి కోసం కృషి …. ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు….

అనంతపురం జిల్లా,
రాయదుర్గం నియోజకవర్గం•••••
——————————————-

దళితుల అభ్యున్నతి కోసం, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం రాజకీయంగా వారికి తగిన ప్రాధాన్యత ఇచ్చేందుకు నిర్విరామంగా కృషి చేస్తున్న ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడని ప్రభుత్వ విప్, రాయదుర్గం శాసనసభ్యులు కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని పురపాలక సంఘం కార్యాలయంలో, దళితవాడలోను అంబేద్కర్ విగ్రహానికి, చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. దేశంలో ఎక్కడా ఏ ప్రభుత్వం అమలు చేయని విధంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక అంతరాలు తొలగిపోయి అన్ని సామాజిక వర్గాలకు సమానమైన గౌరవం హోదా లభించే విధంగా ప్రజాస్వామ్యం పరిడి విల్లాలని అంబేద్కర్ ఆశ సాధనకు ప్రతి ఒక్కరూ కంకణ బద్ధులై పని చేయాలని కోరారు.

బైట్స్. కాలవ శ్రీనివాసులు, ప్రభుత్వ విప్, రాయదుర్గం శాసనసభ్యులు

Posted Under AP
Editor