అనంతపురం జిల్లా
రాయదుర్గం నియోజకవర్గం•••••
చంద్రబాబు నాయుడు నిండు నూరేళ్లు ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలనే సంకల్పంతో రాయదుర్గం పట్టణంలోని శృంగేరి మఠం వేద పండితులచే పది రోజుల పాటు ప్రత్యేక హోమాలు నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు తెలిపారు.
అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని జంబుకేశ్వర స్వామి ఆలయం ప్రాంగరంలో ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో 10 రోజుల పాటు నిర్వహించే ప్రత్యేక పూజలు, హోమాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ ఆధ్యాత్మిక క్రతువులో భాగంగా నాలుగవ రోజైన మంగళవారం ఉదయం ఆలయ ప్రాంగణంలో భువనేశ్వరి దేవి హోమం చేపట్టారు. దేవి హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… చంద్రబాబు నాయుడు వల్లనే ఈ రాష్ట్రం బాగుపడుతుందని, ప్రజలందరికీ మేలు జరుగుతుందని అందరూ విశ్వసిస్తున్నారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా ఈ నెల 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ‘దశమహావిద్యల’ పేరుతో, పట్టణంలోని అత్యంత ప్రాచీనమైన స్వయంభూ జంబులింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో భక్తిశ్రద్ధలతో ఈ హోమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆయన పరిపాలన ఈ రాష్ట్రానికి చాలా అవసరమని.. ఆయన ఆయుష్షు, ఆరోగ్యం, కుటుంబ క్షేమం కోసం, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం, ముఖ్యంగా రాయదుర్గం నియోజకవర్గ ప్రజల క్షేమాన్ని కాంక్షించి ఈ హోమాలు చేస్తున్నట్లు వివరించారు. గతంలో ఇదే జంబులింగేశ్వర స్వామి ఆలయంలో వరుణ యాగం చేయగా వర్షాలు కురిశాయని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం పది మంది దేవతలను ఆవాహన చేస్తూ, ప్రతిరోజూ ఒక్కో దేవికి సంబంధించిన హోమాలను నిర్వహిస్తున్నామన్నారు. ప్రతిరోజు ఉదయం నుండి మధ్యాహ్నం వరకు జరిగే ఈ కార్యక్రమాల్లో పట్టణ ప్రజలు, ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారని చెప్పారు. గత మూడు రోజులుగా హోమాలు నిర్విఘ్నంగా కొనసాగుతున్నాయని, ఈరోజు భువనేశ్వరి దేవి హోమం నిర్వహిస్తున్నామని తెలిపారు. పది రూపాల్లో అమ్మవారిని ఆవాహన చేసి, హోమం నిర్వహించి పూర్ణాహుతి చేయడం జరుగుతుందన్నారు. అమ్మవారి పూజ ద్వారా చంద్రబాబు నాయుడుకి మంచి జరగాలని ఆశిస్తూ, రాయదుర్గం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబం తరపున ఈ కార్యక్రమాన్ని అత్యంత పవిత్రంగా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు తెలియజేశారు.
బైట్ :కాలవ శ్రీనివాసులు (రాయదుర్గం ఎమ్మెల్యే)
