Latest Posts

ఉరవకొండలో అధికారికంగా అంబేద్కర్ జయంతి వేడుకలు: విగ్రహానికి నివాళులర్పించిన మంత్రి పయ్యావుల కేశవ్

ఉరవకొండ పట్టణంలోని క్లాక్ టవర్ సెంటర్‌లో భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా. బి.ఆర్. అంబేద్కర్ గారి జయంతి వేడుకల్లో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ పయ్యావుల కేశవ్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డా. బి.ఆర్. అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.

ఉరవకొండ పట్టణంలో మొదటిసారిగా మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ గారి చొరవతో అంబేద్కర్ జయంతి కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రివర్యులు మాట్లాడుతూ అంబేద్కర్ గారు సమానత్వం, సామాజిక న్యాయం కోసం చేసిన సేవలు దేశానికి చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయన చూపిన మార్గంలో నడుచుకుంటూ సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం దళితుల అభివృద్ధి, సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తుందని మంత్రివర్యులు తెలిపారు.

Posted Under AP
Editor