ఉరవకొండలో ఘనంగా అంబేద్కర్ జయంతి: రాజ్యాంగ నిర్మాతకు నివాళులర్పించిన యూటీఎఫ్ (UTF) నాయకులు

 

*ఉరవకొండ*
*ప్రపంచ మేధావి-భారత రాజ్యాంగ నిర్మాత: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్*

*ఉరవకొండ యుటిఎఫ్*

*ఉరవకొండ పట్టణంలోని స్థానిక టవర్ క్లాక్ దగ్గర డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా , ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం* *జరిగింది*

*ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా సహాధ్యక్షులు రామప్ప చౌదరి గారు మాట్లాడుతూ, అంబేద్కర్ కేవలం భారత రాజ్యాంగ నిర్మాత మాత్రమే కాదు, స్వేచ్ఛ,సమానత్వం ,మహిళల సామాజిక న్యాయం కోసం, పోరాడిన మహానుభావుడని ఆయన సేవలను, పేర్కొన్నారు. అంబేద్కర్ గారు, 1891 ఏప్రిల్ 14న మహారాష్ట్రలో ఒక దళిత కుటుంబంలో జన్మించి, చిన్నతనం నుంచి కుల వివక్షతకు, సాంఘిక సమానతలకు, అంటరానితనానికి, గురై, అనేక అవమానాలు ఎదుర్కున్నారని, దళితులు,బడుగు బలహీన వర్గాలు, మైనారిటీల కోసం, రాజ్యాంగంలో ప్రత్యేకంగా వారికి రిజర్వేషన్ సౌకర్యాలు కల్పించారని, ప్రతి వ్యక్తి, స్వేచ్ఛతో సమానత్వంతో జీవించాలని, భారత రాజ్యాంగంలో ప్రజలందరికీ ప్రాథమిక , హక్కులు కల్పించారని, పేర్కొన్నారు* .

*అంబేద్కర్ గారు ఈ సమాజంలో అస్పృశ్యత, అంటరానితనాన్ని నిర్మూలించాలని, దళితులకు ఆలయ ప్రవేశం కల్పించాలని, కుల వ్యవస్థ, వర్ణ వ్యవస్థ , ఈ దేశంలో నశించాలని ఎన్నో పోరాటాలు చేశారని, లండన్, కలకత్తా విశ్వవిద్యాలయంలో విద్యను అభ్యసించి ప్రపంచ మేధావిగా, స్వతంత్ర భారతదేశ మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగాను, భారతదేశానికి సేవలందించినారు ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత భారత రాజ్యాంగ నిర్మాతగా, దేశానికి చేసిన సేవలు ఆయన అకుంఠిత దీక్షకు పోరాటానికి నిదర్శనమని, హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తూ భారత రాజ్యాంగా డ్రాప్టింగ్ కమిటీ చైర్మన్ గా భారత రాజ్యాంగాన్ని రూపొందించి ,స్వేచ్ఛ , సమానత్వం రిజర్వేషన్లు, ఓటు హక్కు కల్పించిన మహానుభావుడని ఈ సందర్భంగా యుటిఎఫ్ నాయకులు ఆయన సేవలను స్మరించుకోవడం జరిగింది*

*ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ జిల్లా కార్యదర్శులు శేఖర్ సంజీవ జిల్లా ఆడిట్ మెంబర్ బండయ్య గారు UTF నాయకులు విడపనకల్ మండల ప్రధాన కార్యదర్శి రఘు వజ్రకరూరు ప్రధాన కార్యదర్శి ప్రసన్నకుమార్ నాయకులు జయరాములు శివ శ్రీనివాస గుప్తా వేణు శ్రీధర్ గిరి పోతప్ప జానకి రాములు తదితరులు పాల్గొన్నారు 🚩🚩🚩🚩🚩🚩🚩 తదితరులు పాల్గొన్నారు*

Posted Under AP
Editor